14
October, 2026

A News 365Times Venture

14
Wednesday
October, 2026

A News 365Times Venture

Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు

Date:

Srisailam Reservoir: శ్రీశైలం జలాశయం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రతిష్ఠాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయానికి చోటు లభించింది. ఈ గుర్తింపుతో దేశంలో ఈ ఘనత సాధించిన తొలి ప్రాజెక్టుగా శ్రీశైలం జలాశయం నిలిచింది. ఈ సందర్భంగా సంస్థ సౌత్ రీజినల్ జాయింట్ సెక్రటరీ ఇలియాజర్.. శ్రీశైలం ఎమ్మెల్యేకు, ఇరిగేషన్ అధికారులకు సర్టిఫికెట్లను అందజేశారు.

దక్షిణాసియాలో మరే ప్రాజెక్టులోనూ లేని విధంగా శ్రీశైలం జలాశయంలో 60 అడుగుల వెడల్పు, 55 అడుగుల ఎత్తు కలిగిన గేట్లు ఉండటం ఈ గుర్తింపునకు ప్రత్యేకతగా నిలిచింది. జలాశయం నిర్మాణం, దాని సాంకేతిక సామర్థ్యం, వరదలను తట్టుకునే పటిష్టతకు ఈ ఘనత నిదర్శనంగా నిలుస్తోంది. 2009లో వచ్చిన భారీ వరదల సమయంలో శ్రీశైలం జలాశయం రికార్డు స్థాయిలో 25.4 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకుని పటిష్టంగా నిలిచింది. ఆ సమయంలో జలాశయం ప్రదర్శించిన సామర్థ్యం, నిర్మాణ పటిష్టత దాని ప్రత్యేకతను చాటిచెప్పాయి. ఈ సందర్భంగా శ్రీశైలం ఎమ్మెల్యే ఆనాటి డ్యామ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఇంజనీర్ల కృషిని కొనియాడారు. జలాశయానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గుర్తింపు లభించేలా కృషి చేసిన ఇరిగేషన్ అధికారులను అభినందించారు. ఈ అంతర్జాతీయ గుర్తింపు శ్రీశైలం జలాశయానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చిందని పేర్కొన్నారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..

Hyderabadi Dalcha Recipe: హైదరాబాదీ దాల్చాకు ప్రత్యేక స్థానం ఉంది.. పెళ్లిళ్లు.....

India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..

India Retail Inflation Rises: మార్కెట్‌లో ఏ వస్తువు కొనబోయినా.. ధరలు...

AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్‌డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!

AP Municipality Reservations 2026: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ వైపు...

Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం

Sharad Navratri 2026: ఈ ఏడాది శరన్నవరాత్రులు అంటే దేవీ నవరాత్రులు...