15
September, 2026

A News 365Times Venture

15
Tuesday
September, 2026

A News 365Times Venture

Smart Phone Prices: ఇకపై స్మార్ట్‌ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్‌టీ..?

Date:

భారతదేశంలో పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ ధరలు సామాన్య ప్రజలతో పాటు మొబైల్ తయారీ కంపెనీలకూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) కేంద్ర ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన చేసింది. ఆపిల్, షావోమి, ఒప్పో, వివో వంటి దిగ్గజ గ్లోబల్, దేశీయ కంపెనీలు సభ్యులుగా ఉన్న ఈ సంఘం.. మొబైల్ ఫోన్లపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్‌టీని ఏకంగా 5 శాతానికి తగ్గించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లను కోరింది. రాబోయే జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని చర్చించాలని విజ్ఞప్తి చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఏఐ డేటా కేంద్రాల కోసం డిమాండ్ విపరీతంగా పెరగడంతో, మొబైల్స్‌లో వాడే డ్రామ్, నాండ్ ఫ్లాష్ మెమరీ చిప్స్ ధరలు సెప్టెంబర్ 2025 తర్వాత దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. ఈ భారాన్ని పూర్తిగా భరించలేక కంపెనీలు ధరలను పెంచడంతో, గత ఏడాది కాలంలో ఎంట్రీ-లెవెల్ స్మార్ట్‌ఫోన్ల ధరలు 35 నుంచి 45 శాతం వరకు ఎగిశాయి. ఫలితంగా రూ. 10,000 కంటే తక్కువ ధర ఉండే బడ్జెట్ ఫోన్ల లభ్యత మార్కెట్లో 5 శాతానికి పడిపోయింది.

జీఎస్‌టీ రేటును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తే ఫోన్ల ప్రారంభ ధరలు గణనీయంగా తగ్గుతాయని ICEA భావిస్తోంది. ఇది గ్రామీణ ప్రాంత ప్రజలు, తక్కువ ఆదాయ వర్గాలు, తొలిసారి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేవారికి ఎంతో ఊరటనిస్తుంది. దీనివల్ల ఫీచర్ ఫోన్లు, 2జీ వాడేవారు స్మార్ట్‌ఫోన్ల వైపు మళ్లే వేగం పుంజుకుంటుంది. 2017లో జీఎస్‌టీ అమల్లోకి వచ్చినప్పుడు మొబైల్ ఫోన్లపై 12 శాతం పన్ను ఉండగా, 2020 ఏప్రిల్‌లో దానిని 18 శాతానికి పెంచారు.

భారత్‌లో మొబైల్ తయారీ రంగం అద్భుతంగా వృద్ధి చెందింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 18,900 కోట్లుగా ఉన్న ఉత్పత్తి, 2025-26 నాటికి రూ. 6.27 లక్షల కోట్లకు చేరింది. ఎగుమతులు కూడా రూ. 1,566 కోట్ల నుంచి రూ. 2.60 లక్షల కోట్లకు పెరిగాయి. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా నిలిచింది. అయితే ఉత్పత్తి , ఎగుమతులు పెరుగుతున్నప్పటికీ, దేశీయంగా మాత్రం డిమాండ్ మందగించింది. పన్ను తగ్గింపు ద్వారా విక్రయాలు ఊపందుకుంటాయని, డిజిటల్ సేవలు విస్తరిస్తాయని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!

India’s Artificial Sun: భారత్ ‘‘కృత్రిమ సూర్యుడి’’ పరీక్షను విజయవంతగా నిర్వహించింది....

Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన

గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను ఓ కారు డ్రైవర్ ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టి పారిపోయాడు....

Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు

Oracle layoffs: టెక్‌ సంస్థల్లో ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ ఆగడం లేదు.....

India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..

India-China Ties: భారత్-చైనా సంబంధాలపై చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత...