23
October, 2026

A News 365Times Venture

23
Friday
October, 2026

A News 365Times Venture

SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!

Date:

SL vs ENG: రావల్పిండిలో జరిగిన పాకిస్థాన్ వన్డే ట్రై-సిరీస్ మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై శ్రీలంక సంచలన విజయం సాధించింది. 430 పరుగుల భారీ లక్ష్యాన్ని 49.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఒక్క బంతి మిగిలి ఉండగానే రెండు వికెట్ల తేడాతో శ్రీలంక అద్భుత విజయాన్ని అందుకుంది.

మ్యాచ్ విశ్యానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 429 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 116 బంతుల్లోనే 202 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి అవుట్ అయ్యాడు. బ్రూక్‌కు జో రూట్ 69 పరుగులతో, టామ్ బాంటన్ 50 పరుగులతో సహకరించారు. చివర్లో విల్ జాక్స్ కేవలం 30 బంతుల్లోనే అజేయంగా 66 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లండ్ స్కోరు 400+ పరుగులు చేయగలిగింది.

430 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 24 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే అవిష్క ఫెర్నాండో, పవన్ రత్నాయకే ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 166 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అవిష్క 83 బంతుల్లో 97 పరుగులు చేసి సెంచరీకి మూడు పరుగుల దూరంలో ఔటయ్యాడు. ఆ తర్వాత పవన్ రత్నాయకే తన దూకుడును కొనసాగించాడు. 106 బంతుల్లో 130 పరుగులు చేసి శ్రీలంక ఛేజింగ్‌కు బలమైన పునాది వేశాడు. ఇక పవన్ రత్నాయకే ఔటైన తర్వాత దసున్ శనక ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 50 బంతుల్లో 97 పరుగులు చేసి 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. శనక ఔటైన తర్వాత కూడా శ్రీలంక బ్యాటర్లు ఒత్తిడిని ఎదుర్కొంటూ లక్ష్యం వైపు దూసుకెళ్లారు. చివర్లో జనిత్ లియానగే 27 బంతుల్లో అజేయంగా 61 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు.

చివరి ఓవర్లలో ఈ ఉత్కంఠ మరింత పెరిగింది. చివరి ఓవర్లో లంక విజయానికి 8 పరుగులు అవసరం కాగా.. మొదటి బంతికి ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ఆ తర్వాతి రెండు బంతులతో లంక 2 వికెట్లు కోల్పవడంతో మ్యాచ్ పతాక స్థాయికి చేరుకుంది. దీనితో లంక 49.3 ఓవర్లకు శ్రీలంక 423/8తో నిలిచింది. అయితే ఆ తర్వాత బంతికి అసిత ఫెర్నాండో సింగిల్ తీశాడు. దానితో 2 బంతుల్లో 6 పరుగులు అవసరమైన సమయంలో జనిత్ లియానగే కళ్లు చెదిరే స్ట్రైట్ సిక్సర్ తో శ్రీలంకకు మరిచిపోలేని విజయాన్ని అందించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 3 వికెట్లు పడగొట్టగా.. సామ్ కరన్ 2 వికెట్లు తీశాడు. జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అయితే భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఇంగ్లండ్ బౌలర్లు విఫలమయ్యారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!

SA vs AUS: గ్క్వెబెర్హాలో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన...

CM Chandrababu Naidu: వారం రోజులే గడువు.. క్షేత్రస్థాయికి వెళ్లండి, ప్రజల్లో ఉంటే తిరుగుండదు..! నేతలకు సీఎం కీలక ఆదేశాలు..

Chandrababu Naidu: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంత్రులు, ఎంపీలు,...

Saudi Arabia: అప్పు చేసి సౌదీకి వెళ్లిన బంగ్లాదేశీ మహిళ.. చివరకు మరణశిక్ష!.

Saudi Arabia: సౌదీ అరేబియాలో బంగ్లాదేశీ యువకుడు నజ్రుల్ ఇస్లాం, మహిళ...

AP SEC: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు NOC, నో డ్యూ సర్టిఫికెట్లు అవసరం లేదు..!

AP SEC: రాష్ట్రంలో జరగనున్న పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల సాధారణ...