29
September, 2026

A News 365Times Venture

29
Tuesday
September, 2026

A News 365Times Venture

Shubman Gill: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్‌మన్ గిల్.. సెంచరీతో కదం తొక్కిన కెప్టెన్..

Date:

భారత క్రికెట్ జట్టు యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తూ అజేయమైన శతకంతో మెరిశాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో గిల్ తన అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న భారత్, వెస్టిండీస్‌ను 295 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం 296 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. రోహిత్ శర్మ 32 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

ఇన్నింగ్స్ ప్రారంభంలో కేవలం 11 వ్యక్తిగత పరుగుల వద్ద కీమో డెలివరీలో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగే ప్రమాదం నుండి గిల్ తప్పుకున్నాడు. విండీస్ ఫీల్డర్ ఆ క్యాచ్‌ను నేలపాలు చేయడం ఆ జట్టుకు శాపంగా మారింది. ఆ వచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్న గిల్, వెస్టిండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ మైదానం నలుమూలల బౌండరీల వర్షం కురిపించాడు. జేడెన్ సీల్స్ వేసిన బంతిని స్ట్రెయిట్ డ్రైవ్ చేసి ఫోర్ బాదడం ద్వారా గిల్ తన అద్భుతమైన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సెంచరీ పూర్తి కాగానే హెల్మెట్ తీసి మైదానంలోని ప్రేక్షకులకు అభివాదం చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ అద్భుత శతకంలో గిల్ 96 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 1 సిక్సర్‌తో 105 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. వన్డేల్లో గిల్ కు ఇది 10వ శతకం.

గిల్‌కు తోడుగా విరాట్ కోహ్లీ కూడా వీరోచితంగా పోరాడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు. వీరిద్దరి మధ్య రెండో వికెట్‌కు అద్భుతమైన సెంచరీ భాగస్వామ్యం నెలకొంది. కేవలం 109 బంతుల్లోనే వీరిద్దరూ 126 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని జోడించి భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు. విరాట్ కోహ్లీ కూడా దూకుడుగా ఆడుతూ 50 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత్ విజయానికి కేవలం 96 పరుగులు మాత్రమే అవసరమై ఉండగా, చేతిలో వికెట్లు పుష్కలంగా ఉన్నాయి. రన్ రేట్ కూడా అద్భుతంగా కొనసాగుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..

అమరావతిలో అక్టోబర్ 1వ తేదీ ఉదయం 6:30 గంటల నుంచే లబ్ధిదారుల...

WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..

మహిళా ప్రీమియం లీగ్ 2027 సీజన్‌కు సంబంధించి డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్...

Virat Kohli: వన్డేల్లో విరాట్‌ కోహ్లీ మరో అద్భుత రికార్డు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..

భారత క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ చరిత్రలో మరో...

The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!

The Paradise Shankaranna: హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో...