5
July, 2026

A News 365Times Venture

5
Sunday
July, 2026

A News 365Times Venture

Shreyas Iyer: కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి..

Date:

Shreyas Iyer: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో మూడు కంటే ఎక్కువ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన 12 మంది కెప్టెన్లలో శ్రేయస్ ఒకడిగా నిలిచాడు. అయితే.. తన కెప్టెన్సీ కెరీర్ ప్రారంభించిన మొదటి నాలుగు మ్యాచ్‌లలో ఒక్క విజయాన్ని సైతం నమోదు చేయలేకపోయిన ఏకైక కెప్టెన్‌గా అయ్యర్ చెత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అతని నాయకత్వంలో భారత్ గతంలో ఐర్లాండ్‌లో రెండు మ్యాచ్‌లు ఓడిపోగా, ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో మొదటి టీ20 వర్షం వల్ల రద్దయింది. తాజాగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమి చవిచూడటంతో ఇంగ్లాండ్ ఈ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

నిన్నటి మ్యాచ్ విషయానికి వస్తే.. 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ గట్టి షాక్ ఇచ్చాడు. మొదటి ఓవర్లోనే ప్రమాదకరమైన ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్‌లను డకౌట్ చేసి భారత్‌కు మంచి పట్టు సాధించి పెట్టాడు. అయితే, ఆ తర్వాత హ్యారీ బ్రూక్ (39), జాకబ్ బెథెల్ (76), టామ్ బాంటన్ (39) అద్భుత ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌ను భారత్ నుంచి లాగేసుకున్నారు. ఒక దశలో 16 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ విజయానికి 49 పరుగులు కావాలి, ఆస్కింగ్ రన్ రేట్ సైతం దాదాపు 12గా ఉంది. కానీ, స్పిన్నర్ రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఆ ఓవర్లో అతను నో-బాల్‌తో పాటు ఏకంగా 29 పరుగులు సమర్పించుకోవడంతో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లాండ్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. తాము ఎక్కడ తప్పు చేశామో తనకు తెలుసని, అయితే ఓటమికి ఏ ఒక్క ఆటగాడిని బ్లేమ్ చేయదలుచుకోలేదని అన్నాడు. రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవరే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అని, ఆ నో-బాల్ వల్ల మ్యాచ్ చేజారిందని ఒప్పుకుంటూనే.. బిష్ణోయ్ ఈ తప్పుల నుంచి నేర్చుకుని బలంగా పునరాగమనం చేస్తాడనే నమ్మకాన్ని వ్యక్తపరిచాడు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Heavy Rain Alert: తెలంగాణకు వాన ముప్పు.. ఈ 4 రోజులు జాగ్రత్త..

Telangana Heavy Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది....

Eluru: తీవ్ర విషాదం.. రైలు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

Eluru: ఏలూరు జిల్లా చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి...