5
October, 2026

A News 365Times Venture

5
Monday
October, 2026

A News 365Times Venture

Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!

Date:

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి పర్యటించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్‌-2.0 పథకం కింద రాష్ట్రంలో మూడు లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అలాగే దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల పైలట్ ప్రాజెక్టుకు కూడా శ్రీకారం చుట్టారు. బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెం గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద మొత్తం 177 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రశంసలు కురిపించారు. తెనాలి ప్రాంతం ప్రతిభకు మారుపేరని, తెనాలి రామకృష్ణ పేరు దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితమని శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్ అని కొనియాడారు. అమరావతి నిర్మాణాన్ని పరిశీలించానని, నగర అభివృద్ధి ప్రణాళికలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. అమరావతి భవిష్యత్తులో ఏఐ, డేటా సెంటర్లు, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో ముందంజలో ఉండబోతుందని పేర్కొన్నారు. అమరావతిని చూసి తాను అబ్బురపడ్డానని, చంద్రబాబు ప్రజలతో మమేకమయ్యే తీరు తనను ఆకట్టుకుందని అన్నారు. సీఎం నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తుందని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి పదవుల విషయంలోనూ శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ప్రాంతాలపై అవగాహన లేని వ్యక్తికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు ఎలా ఇస్తారని తాను తొలుత భావించానని.. అయితే పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఆ శాఖ బాధ్యతలు ఇవ్వడం ద్వారా చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకొచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం ఆ పథకాలను సక్రమంగా అమలు చేసి ఉంటే ప్రతి పేద కుటుంబానికీ సొంత ఇల్లు ఉండేదని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కల్పించే లక్ష్యం సాకారం అయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని శివరాజ్‌సింగ్ స్పష్టం చేశారు.

తెలుగు భాష తేనెకంటే తియ్యనిదని శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రశంసించారు. తెలుగు నేల ప్రతిభకు, సంస్కృతికి నిలువుటద్దమని అన్నారు. భాషా సమస్య ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపిస్తున్న ప్రేమాభిమానాలు తనను మళ్లీ మళ్లీ రాష్ట్రానికి రావాలనిపించేలా చేస్తున్నాయని చెప్పారు. ఏపీ ప్రజల మమకారం, అభిమానం తనకు చిరకాలం గుర్తుండిపోతాయని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చెప్పుకొచ్చారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు

BJP: ఫ్లైదుబాయ్ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. కో-పైలట్ ఒమన్ జాతీయుడు...

CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!

గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు....

Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..

ఆనర్ సంస్థ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా ‘ఆనర్ X5ds’ను సౌతాఫ్రికా...

Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్‌ ఉద్యోగి మృతి

Mobile Phone Blast: పిడుగుపాటు కారణంగా అనంతపురం జిల్లాలో విషాద ఘటన...