28
September, 2026

A News 365Times Venture

28
Monday
September, 2026

A News 365Times Venture

Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్

Date:

భారత్ , వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఓటమి అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ తీవ్ర నిరాశతో మాట్లాడారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము చేసిన తప్పిదాలను, ప్రత్యర్థి ఆటతీరును ప్రస్తావించారు. మేము మొదట బ్యాటింగ్ చేసే సమయంలో బోర్డుపై ఇంకా మెరుగైన పరుగులు ఉంచి ఉండాల్సిందని, సరిగ్గా చెప్పాలంటే మేము కనీసం 60 నుంచి 80 పరుగులు తక్కువ చేశామని ఆయన బాధగా చెప్పారు.

మా ఓపెనర్లు నిజంగానే చాలా బాగా ఇన్నింగ్స్ ప్రారంభించారని, జట్టుకు ఒక పటిష్టమైన పునాదిని వేశారని ఆయన కొనియాడారు. కానీ ఆ తర్వాత మిగతా బ్యాటర్లు మధ్య ఓవర్లలో పూర్తిగా తడబడ్డారని, రన్స్ చేయలేక ఇబ్బంది పడ్డారని తెలిపారు. క్రికెట్‌లో కీలకమైన క్షణాలను మన వైపు తిప్పుకోవడంలో విఫలమయ్యామని, అదే మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిందని వాపోయారు. అంతేకాకుండా.. ఫీల్డింగ్‌లో తమకు దక్కిన కొన్ని సులభమైన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేకపోయినట్లు ఆయన అంగీకరించారు. ఈ ఓటమి నుంచి తగిన పాఠాలు నేర్చుకుని రాబోయే మ్యాచ్‌లలో మరింత మెరుగైన ప్రదర్శన ఇస్తామని షాయ్ హోప్ స్పష్టం చేశారు.

ఈ మ్యాచ్‌లో భారత యువ సంచలనం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ , రికార్డుల వీరుడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీరు అద్భుతం అని కొనియాడారు.  వారు క్రీజులో కుదురుకుని ఆడిన తీరు తమ బౌలర్లను పూర్తిగా నిరుత్సాహపరిచిందని ఆయన అన్నారు. గిల్ అద్భుతమైన శతకంతో జట్టును ముందుండి నడిపిస్తే, కోహ్లీ మాత్రం తన అనుభవంతో స్టేడియం నలుమూలలా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడని, వారిద్దరి భాగస్వామ్యం తమ జట్టును మ్యాచ్‌కి దూరం చేసిందని తెలిపారు.

మరోవైపు భారత బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్ చాలా అద్భుతంగా బౌలింగ్ వేసి తమ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడని ఆయన ప్రశంసించారు. తాము మ్యాచ్‌లో ఒక మోస్తరుగా మంచి స్కోరు సాధించినప్పటికీ, భారత బ్యాటర్ల జోరు ముందు ఆ స్కోరు ఏ మాత్రం సరిపోలేదని షాయ్ హోప్ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ ఓటమి తమకు ఒక పెద్ద కనువిప్పు అని, తదుపరి మ్యాచ్‌లో పటిష్టమైన వ్యూహాలతో బరిలోకి దిగుతామని ఆయన ముగించారు. మా ఓటమిని కోహ్లీ, గిల్, కుల్దీప్ యాదవ్‌లే ఓటమికి కారణమన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్

తెలంగాణలో కొత్తగా 41 టూబీ (2B) బార్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రొహిబిషన్...

Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..

Parvesh Verma Slap Row: ఢిల్లీలో రోడ్డు తనిఖీ సమయంలో పీడబ్ల్యూడీ...

Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!

భారతీయ బ్యాంకింగ్ రంగంలో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. కేరళ...

CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?

CEC Impeachment: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ కేంద్రంగా...