10
November, 2026

A News 365Times Venture

10
Tuesday
November, 2026

A News 365Times Venture

Scam: నల్లగొండలో నకిలీ ఉద్యోగ స్కాం.. రిటైర్మెంట్ తర్వాత డెత్ డ్రామా..

Date:

నల్లగొండ జిల్లా వైద్యారోగ్య శాఖ (DMHO) కార్యాలయంలో నకిలీ పత్రాలతో కారుణ్య నియామకం పొందిన భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేసిన చామకూరి వెంకటేశ్వర్లు మే 31, 2025న పదవీ విరమణ పొంది, ఆ తర్వాత నవంబర్ 17, 2025న మరణించారు. అయితే, ఆయన పదవీ విరమణ పొందిన విషయాన్ని దాచిపెట్టి, సర్వీసులో ఉండగానే చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్, ఇతర నకిలీ ధ్రువీకరణ పత్రాలను సృష్టించారు.

ఈ నకిలీ పత్రాల ఆధారంగా వెంకటేశ్వర్లు కొడుకు చామకూరి రాజుకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పించేందుకు కుట్ర పన్నారు. ఈ ప్రక్రియ కోసం మృతుడి భార్య వసంత, DMHO కార్యాలయ సీసీ (CC) రంజిత్ కుమార్‌తో రూ. 13 లక్షలకు ఉద్యోగ ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అడిగిన మొత్తంలో కొంత భాగం నజరానాగా చెల్లించి అక్రమ పద్ధతిలో ఉద్యోగ ఉత్తర్వులను పొందారు.

ఈ వ్యవహారంపై అనుమానం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. ప్రభుత్వ శాఖల్లోని అధికారుల సహకారంతోనే ఈ అక్రమార్జన పత్రాల సృష్టి జరిగిందని నిర్ధారించారు. నకిలీ డెత్ సర్టిఫికెట్ తయారు చేయడం, కారుణ్య నియామక నిబంధనలను ఉల్లంఘించడం, ప్రభుత్వానికి నమ్మకద్రోహం చేయడం వంటి నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కుంభకోణానికి సంబంధించి మృతుడి కుటుంబ సభ్యులు, DMHO కార్యాలయ సిబ్బంది, మధ్యవర్తులు, నకిలీ పత్రాల తయారీకి సహకరించిన వారితో సహా మొత్తం 16 మందిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఈ కారుణ్య నియామక స్కామ్‌లో ఇంకా ఎవరైనా అధికారులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు తదుపరి దర్యాప్తును వేగవంతం చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Diwali Cleaning Tips: దీపావళి వేళ నూనె మరకలు జిడ్డుగా మారిపోయాయా? ఈ సింపుల్ చిట్కా చాలు..

Diwali Cleaning Tips: దేశం మొత్తం దీపావళి కాంతులతో వెలిగిపోతుంది.. అయితే,...

Pakistan Tarbela Dam Accident: పాక్‌లో నిర్మాణంలో ఉన్న ఆనకట్ట కూలి భారీ వరదలు.. చైనా నిర్మాణ సంస్థపై ప్రశ్నలు..!

Pakistan Tarbela Dam Accident: పాకిస్థాన్‌లో భారీ నిర్మాణ ప్రాజెక్టులో ఘోర...

Off The Record: విజయనగరం మేయర్ విషయంలో కోలగట్ల తడబాటు.. అతి విశ్వాసంతో మొదటికే మోసం..!

Off The Record: మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామికి...

AP Cabinet Meeting: మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్? రేపటి కేబినెట్ భేటీపై ఉత్కంఠ

AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు అనగా...