24
April, 2026

A News 365Times Venture

24
Friday
April, 2026

A News 365Times Venture

Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..

Date:

ముంబైలోని వాంఖడే స్టేడియం సాక్షిగా చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనింగ్  బ్యాటర్ సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న సంజూ, ముంబై బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ మరో అద్భుత శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఐపీఎల్ 2026లో సంజూకు రెండో శతకం ఇది. మైదానంలో ఒకవైపు వికెట్లు పడుతున్నా, ఏమాత్రం బెదరకుండా క్రీజులో పాతుకుపోయిన శాంసన్, తన ట్రేడ్ మార్క్ షాట్లతో అభిమానులను ఉర్రూతలూగించాడు. నిలకడలేమి అన్న విమర్శలకు తన బ్యాట్‌తోనే గట్టి సమాధానమిస్తూ, ఈ మ్యాచ్‌లో కేవలం 54 బంతుల్లోనే 101 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 క్లాసిక్ బౌండరీలు, 6 భారీ సిక్సర్లు ఉండటం విశేషం.

ఈ మ్యాచ్‌లో సంజూకి తోడుగా రుతురాజ్ గైక్వాడ్ (22), డెవాల్డ్ బ్రేవిస్ (22), దినేష్ కార్తిక్ (18), మరియు ఓవర్టన్ (15) తమ వంతు సహకారాన్ని అందించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు నమోదైంది. ముంబై బౌలర్లలో ఘజానన్, అశ్వనీ చెరో రెండు వికెట్లు తీసి వికెట్ల పతనాన్ని అడ్డుకోవాలని చూసినా, సంజూ సృష్టించిన విధ్వంసం ముందు వారి ప్రయత్నాలు ఫలించలేదు.

ఈ సెంచరీతో సంజూ శాంసన్ టీ20 క్రికెట్ చరిత్రలో పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఓవరాల్ టీ20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ (చెరో 9 శతకాలు) అగ్రస్థానంలో ఉండగా.. సంజూ శాంసన్ తన 8వ శతకంతో రోహిత్ శర్మ సరసన చేరాడు. ఇక ఐపీఎల్ చరిత్ర విషయానికొస్తే.. అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్లలో కోహ్లీ (8), జోస్ బట్లర్ (7), క్రిస్ గేల్ (6) తర్వాత 5 సెంచరీలతో సంజూ శాంసన్, కేఎల్ రాహుల్‌తో కలిసి నాలుగో స్థానంలో నిలిచాడు. ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌తో రికార్డులన్నీ బద్ధలు కొట్టిన సంజూ, ముంబై ముందు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచాడు. సంజూ చూపించిన ఈ వీరవిహారం అతన్ని భారత టీ20 క్రికెట్‌లో మరో స్థాయికి తీసుకెళ్లింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Off The Record: టీడీపీలోని పరిణామాలపై కొందరు సీనియర్స్ అసహనం..

Off The Record: తెలుగుదేశం పార్టీలో తరం మారుతోంది. అందుకు తగ్గట్టే...

India New Gaming Rules 2026: సర్కార్‌ సరి కొత్త గేమింగ్ రూల్స్‌.. ప్రయోజనకరమా లేక హానికరమా..?

India New Gaming Rules 2026: భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న...

Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు

Off The Record: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ హస్తం నేతల...