18
April, 2026

A News 365Times Venture

18
Saturday
April, 2026

A News 365Times Venture

Sai Marthand: అడివి శేష్‌తో ‘లిటిల్ హార్ట్స్’ దర్శకుడి నెక్స్ట్ మూవీ.. అఫీషియల్ అప్‌డేట్ వచ్చేసింది!

Date:

Sai Marthand: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో స్పీడ్ పెంచారు. వరుస హిట్‌లతో దూసుకుపోతున్న శేష్ తాజాగా తన కొత్త సినిమా డెకాయిత్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ రోజు నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ సాయి మార్తాండ్‌ మాట్లాడుతూ.. శేష్ నెక్ట్స్ సినిమా తనతోనే అని కన్ఫార్మ్ చేశాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో సరికొత్త చిత్రం రాబోతున్నట్లు ఈ వేదికపై అధికారికంగా ప్రకటించారు.

READ ALSO: OTR: ఉద్యోగులు vs మండలి.. దుర్గమ్మ ఆలయంలో అధికార దర్పం.?

గతేడాది (2025) విడుదలైన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘లిటిల్ హార్ట్స్’తో సాయి మార్తాండ్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మౌలి తనుజ్, శివాని నాగారం ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.40 కోట్లు వసూలు చేసి ఘనవిజయం సాధించింది. ఆ సినిమా సక్సెస్ తర్వాత ఈ డైరెక్టర్‌తో శేష్ కొలాబరేషన్ పై అప్పట్లోనే రూమర్స్ స్టార్ అయ్యాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, నరేషన్ ఇప్పటికే పూర్తయిందని, గూఢచారి 2 సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా అడివి శేష్ అంటే థ్రిల్లర్స్, యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అయితే సాయి మార్తాండ్ తన మొదటి చిత్రంతో లవ్ & కామెడీ ఎలిమెంట్స్‌ను హ్యాండిల్ చేయడంలో దిట్ట అని నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోయే సినిమా కంప్లీట్ లవ్ స్టోరీ లేదా రొమాంటిక్ డ్రామాగా ఉండే అవకాశం ఉందని ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే వెల్లడించనుంది.

READ ALSO: Mrunal Thakur: స్టేజ్‌పై మృణాల్ ఠాకుర్‌కు సారీ చెప్పిన హీరో!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Fake Letters: పవన్ కళ్యాణ్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఎర.. సంతకాన్ని ఫోర్జరీ చేసి మరీ..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును అడ్డుపెట్టుకుని కొందరు అక్రమార్కులు...

Regina Cassandra: కోల్పోయాకే దాని విలువ తెలిసింది.. రెజీనా కాసాండ్రా ఎమోషనల్ పోస్ట్ వైరల్!

తెలుగులో ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి...

Macron-Meloni Kiss: ఇటలీ ప్రధాని మెలోని బుగ్గపై ముద్దు పెట్టిన మాక్రాన్.. వీడియో వైరల్

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఫ్రాన్స్ పర్యటనకు వచ్చారు. అయితే మెలోనికి...

Donald Trump: ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తాం.. బాంబు పేల్చిన ట్రంప్..

Donald Trump: అమెరికా-ఇరాన్ మధ్య రెండో రౌండ్ చర్చలు ఇస్లామాబాద్...