5
September, 2026

A News 365Times Venture

5
Saturday
September, 2026

A News 365Times Venture

Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?

Date:

Royal Enfield Himalayan 440 Launched: అడ్వెంచర్ బైక్ ప్రియులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ గుడ్‌న్యూస్ చెప్పింది. కంపెనీ కొత్త హిమాలయన్ 440 బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రస్తుతం విక్రయిస్తున్న హిమాలయన్‌తో పాటు ఈ కొత్త మోడల్ కూడా అందుబాటులో ఉంటుంది. హిమాలయన్ 411 డిజైన్‌ను ఇష్టపడినవారిని, హిమాలయన్ 450కి తక్కువ ధరలో ప్రత్యామ్నాయం కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ బైక్‌ను తీసుకొచ్చింది. కొత్త హిమాలయన్ 440లో రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440లో ఉపయోగించిన అదే ఇంజన్‌ను అమర్చింది. డిజైన్ పరంగా కూడా స్క్రామ్ 440 ప్రభావం కనిపిస్తుంది. అయితే రంగులు, వీల్స్, సస్పెన్షన్ సెటప్ వంటి అంశాల్లో ఇది స్క్రామ్ 440కి భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా హిమాలయన్ 411ను మిస్ అవుతున్న అభిమానులను ఆకట్టుకునేలా దీని డిజైన్‌ను రూపొందించారు.

ఇంజన్, పనితీరు
హిమాలయన్ 440లో 24.4 హెచ్‌పీ పవర్, 34 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఇంజన్ ఉంది. దీనికి 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌ను జత చేశారు. అడ్వెంచర్ రైడింగ్‌ను దృష్టిలో పెట్టుకుని బైక్‌కు తగిన సస్పెన్షన్ సెటప్‌ను అందించారు.

బ్రేకులు, ఏబీఎస్
ఈ బైక్‌లో 15 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ముందు వైపు 300 మిమీ, వెనుక వైపు 240 మిమీ డిస్క్ బ్రేకులు అందించారు. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌ను స్టాండర్డ్‌గా ఇచ్చారు. అవసరాన్ని బట్టి వెనుక ఏబీఎస్‌ను నిలిపివేసే ఆప్షన్ కూడా ఉంది.

నావిగేషన్‌తో కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
హిమాలయన్ 440లో ట్విన్-పాడ్ లేఅవుట్‌తో కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. ఎడమ వైపున స్పీడోమీటర్ ఉండగా, కుడి వైపున ట్రిప్పర్‌ను ఏర్పాటు చేశారు. గూగుల్ మ్యాప్స్ ఆధారిత నావిగేషన్‌ను ట్రిప్పర్ ద్వారా పొందవచ్చు. దీంతో లాంగ్ రైడ్స్ చేసే వారికి ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది. బైక్‌లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్ కూడా ఉంది.

మూడు రంగుల్లో లభ్యం
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 440 ఒకే వేరియంట్‌లో మూడు రంగుల ఎంపికలతో అందుబాటులోకి వచ్చింది. మస్టాంగ్ బ్రౌన్, నెల్లా వైట్, సెల్లా బ్లాక్ రంగుల్లో దీనిని కొనుగోలు చేయవచ్చు.

ధర, బుకింగ్స్
హిమాలయన్ 440 ఎక్స్‌షోరూమ్ ధర చెన్నైలో రూ.2.29 లక్షలుగా నిర్ణయించారు. ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న కస్టమర్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ అధికారిక వెబ్‌సైట్ లేదా సమీపంలోని కంపెనీ షోరూమ్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?

Off The Record: తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్‌...

Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు!

AP Weather Forecast: ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌...

Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్‌డేట్.. వేచి చూడండి!

తెలంగాణ కాంగ్రెస్‌లో గత రెండు, మూడు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజకీయంగా...