14
June, 2026

A News 365Times Venture

14
Sunday
June, 2026

A News 365Times Venture

Rohit Sharma: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ దాసోహం..

Date:

ధర్మశాల వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 16,000 పరుగుల అద్భుతమైన మార్క్‌ను చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో రోహిత్ శర్మ ఈ రికార్డును అందుకున్నాడు. ఒమర్జాయ్ వేసిన బ్యాక్ ఆఫ్ ద లెంగ్త్ డెలివరీని రోహిత్ శర్మ తనదైన శైలిలో అద్భుతమైన ఫుల్ షాట్‌తో స్క్వేర్ లెగ్ స్టాండ్స్‌లోకి భారీ సిక్సర్‌గా మలిచాడు. ఈ సిక్సర్‌తోనే ఓపెనర్‌గా 16 వేల అంతర్జాతీయ పరుగుల మైలురాయిని దాటేశాడు. ప్రపంచ క్రికెట్‌లో ఓపెనర్‌గా వచ్చి ఈ స్థాయిలో పరుగులు సాధించిన అతికొద్ది మంది దిగ్గజాల సరసన రోహిత్ చేరాడు. అదే ఓవర్ చివరి బంతికి డీప్ మిడ్-వికెట్ మీదుగా మరో ఫోర్ కొట్టి రోహిత్ మంచి టచ్‌లో కనిపించాడు. ఇండియా నుంచి మొదటి స్థానంలో విరేంద్ర సేహ్వాగ్ ఉన్నాడు.

వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించారు. భారత్ 3.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసి ఊపుమీదున్నాు. రోహిత్ శర్మ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 15 పరుగులు చేయగా, శుభ్‌మన్ గిల్ 7 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ప్రస్తుత రన్ రేట్ 9.9 గా ఉండగా.. భారత్ విజయం సాధించాలంటే ఇంకా 162 పరుగులు చేయాల్సి ఉంది.

ఓపెనర్‌గా రోహిత్ శర్మ సాధించిన ఈ 16,000 పరుగుల రికార్డు అతని నిలకడకు, క్లాస్‌కు నిదర్శనం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతనికి ఉన్న తిరుగులేని రికార్డులు, ముఖ్యంగా వన్డేల్లో అతనికున్న మూడు డబుల్ సెంచరీలు అతనిని ప్రపంచ అత్యుత్తమ ఓపెనర్లలో ఒకడిగా నిలబెట్టాయి. ధర్మశాల మైదానంలో రోహిత్ శర్మ తన ట్రేడ్‌మార్క్ సిక్సర్‌తో ఈ ఘనత సాధించడం అభిమానులను ఎంతగానో అలరించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Modi-Trump Meet: ఫ్రాన్స్‌లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్‌హౌజ్..

Modi-Trump Meet: వచ్చే వారం ఫ్రాన్స్‌లో జరగనున్న జీ7 శిఖరాగ్ర సమావేశంలో...

Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

ఆర్ఎస్ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ.. కానీ అత్యంత అపార్థం చేసుకున్న...

Chiranjeevi : చరణ్ కష్టం చూసి ‘ఇంత అవసరమా’ అనుకున్నా

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో...