24
June, 2026

A News 365Times Venture

24
Wednesday
June, 2026

A News 365Times Venture

Road Accident: తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. టాటా ఏస్ బోల్తా, ముగ్గురు మృతి!

Date:

తూర్పుగోదావరి జిల్లాలోని రంగంపేట మండల పరిధిలో వడిశలేరు-రంగంపేట మధ్య మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణ పనులు ముగించుకుని స్వగ్రామాలకు తిరిగి వస్తున్న కార్మికులు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ విషాద ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం పిఠాపురం మండలంలోని మల్లాం, జల్లూరు గ్రామాలకు చెందిన 11 మంది కార్మికులు బాపట్ల జిల్లా కొల్లూరు ప్రాంతానికి నిర్మాణ పనుల నిమిత్తం వెళ్లారు. రెడీమిక్స్ వాల్స్ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని మిగిలిన సామగ్రితో కలిసి స్వగ్రామాలకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో వాహనం టైర్ పంక్చర్ కావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి వాహనం రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సామర్లకోటకు చెందిన మసకపల్లి బాబు, మురమర్ల రాజు, కాకడ రాజు అనే ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఎనిమిది మంది స్వల్ప గాయాలతో బయటపడగా.. వారిని 108 అంబులెన్స్‌ల సాయంతో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో అరగంటలో తమ గమ్యస్థానాలకు చేరుకునే సమయంలో ఈ విషాదం చోటుచేసుకోవడం కుటుంబ సభ్యులను విషాదంలో ముంచెత్తింది. సమాచారం అందుకున్న రంగంపేట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో మృతుల స్వగ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Saikrishna Custodial Death Case: సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టు.. వెలుగులోకి సంచనల విషయాలు!

విజయవాడలో సంచలనం రేపిన సాయికృష్ణ అదృశ్యం, మృతి కేసులో ప్రత్యేక దర్యాప్తు...

CBSE రీవాల్యుయేషన్‌లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన ‘అవ్ని కేజ్రీవాల్’.!

CBSE Revaluation: సీబీఎస్ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్ ఫలితాల్లో రాంచీకి చెందిన...

TMC Crisis: మమతా బెనర్జీపైనే వేటు వేసిన టీఎంసీ తిరుగుబాటు వర్గం.. కొత్త బాస్‌గా అరూప్ రాయ్ ప్రకటన!

TMC Crisis: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. అధికార...

Ben Stokes కెరియర్ సేఫ్.. నైట్‌క్లబ్ వివాదంలో క్లీన్‌చిట్ ఇచ్చిన ఈసీబీ..!

Ben Stokes: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes),...