24
June, 2026

A News 365Times Venture

24
Wednesday
June, 2026

A News 365Times Venture

Layoffs: టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ కలకలం.. ఏకంగా 21,000 మందిని తొలగించిన దిగ్గజ కంపెనీ..

Date:

Oracle Layoffs: కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత రంగప్రవేశంతో కార్పొరేట్ కంపెనీల్లో సామర్థ్యం పెరుగుతుండవచ్చు కానీ, ఉద్యోగుల జీవితాల్లో మాత్రం అది తీవ్ర అస్థిరతకు, ఆందోళనకు కారణమవుతోంది. దీనికి తాజా ఉదాహరణే అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle). ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా తన వ్యాపార శైలిని పూర్తిగా మార్చుకునే ప్రక్రియలో భాగంగా.. ఒరాకిల్ సంస్థ 2026 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 21,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. కంపెనీ విడుదల చేసిన తాజా వార్షిక నివేదిక (Annual Report) ప్రకారం.. ఒరాకిల్ మొత్తం ఉద్యోగుల సంఖ్య గతేడాది 1,62,000 ఉండగా.. ఇందులో నుంచి 13 శాతం తగ్గి మే 31, 2026 నాటికి 1,41,000కు పడిపోయింది. అంతేకాదు, ఈ ఉద్యోగాల కోత ఇక్కడితోనే ఆగిపోకపోవచ్చని కంపెనీ సంకేతాలు ఇచ్చింది.

ఒరాకిల్ పనితీరును మార్చేస్తున్న ఏఐ..

సోమవారం విడుదల చేసిన ఈ నివేదికలో ఒరాకిల్ సంస్థ స్పందిస్తూ.. “మా వ్యాపార కార్యకలాపాలలో ఏఐ (AI) సాంకేతికతలను విస్తృతంగా అమలు చేయడం వల్లే ఈ స్థాయిలో సిబ్బంది తగ్గింపు జరిగింది. భవిష్యత్తులోనూ ఈ ప్రభావంతో మరిన్ని ఉద్యోగాల కోతలు ఉండే అవకాశం ఉంది” అని పేర్కొంది. కేవలం ఏఐ మాత్రమే కాకుండా మేనేజ్‌మెంట్ మార్పులు, ఉత్పత్తి వ్యూహాలు, ఉద్యోగుల పనితీరు సమస్యలు, వ్యూహాత్మక మార్పులు, ఇతర కంపెనీల కొనుగోళ్లు (Acquisitions) సైతం ఈ నిర్ణయానికి కారణాలని కంపెనీ వెల్లడించింది. నిజానికి ఈ ఏడాది మార్చిలోనే ఒరాకిల్ భారీగా ఉద్యోగాలను తొలగించబోతున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఏఐ డేటా సెంటర్ల విస్తరణ కోసం చేస్తున్న భారీ ఖర్చుల వల్ల కంపెనీ ఎదుర్కొంటున్న నగదు కొరతను (Cash Crunch) అధిగమించేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి.

ఏఐ కోసం వందల కోట్ల డాలర్ల ఖర్చు..

ఛైర్మన్ లారీ ఎల్లిసన్ నాయకత్వంలోని ఒరాకిల్ సంస్థ ఇప్పుడు కేవలం ఒక డేటాబేస్ సాఫ్ట్‌వేర్ కంపెనీగానే మిగిలిపోవాలని అనుకోవడం లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల్లో అగ్రగామిగా ఎదగడానికి తన చరిత్రలోనే అత్యంత భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రముఖ ఏఐ సంస్థ ‘OpenAI’ వంటి పెద్ద కస్టమర్ల కోసం ఏఐ వర్క్‌లోడ్‌లను నిర్వహించగల భారీ డేటా సెంటర్లను ఒరాకిల్ నిర్మిస్తోంది. ఈ వ్యూహంతో అమెజాన్ (AWS), మైక్రోసాఫ్ట్ (Azure) వంటి మార్కెట్ దిగ్గజాలకు ఒరాకిల్ నేరుగా సవాలు విసురుతోంది. అయితే ఇక్కడ ఒక పెద్ద వ్యత్యాసం ఉంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్ కంపెనీలకు ఉన్న భారీ ఉచిత నగదు ప్రవాహం (Cash Flow) ఒరాకిల్‌కు లేదు. అందువల్ల తన ఏఐ కలలను నిజం చేసుకోవడానికి ఒరాకిల్ సొంత నగదును ఖర్చు చేయడంతో పాటు, పెద్ద ఎత్తున అప్పులు (Debt) సేకరించడంపైనే ఆధారపడుతోంది. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 70 బిలియన్ డాలర్ల నికర మూలధన వ్యయాన్ని (Capital Expenditure) ఒరాకిల్ అంచనా వేస్తోంది. ఈ ఖర్చుల నిధుల కోసం అప్పులు, ఈక్విటీ ద్వారా మరో 40 బిలియన్ డాలర్లను సేకరించాలని కంపెనీ యోచిస్తోంది.

పునర్వ్యవస్థీకరణ భారం..

సాంకేతికత మార్పు కోసం ఒరాకిల్ చెల్లిస్తున్న మూల్యం చాలా భారీగా ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ పునర్వ్యవస్థీకరణ (Restructuring), ఉద్యోగుల తొలగింపుల పరిహారం (Severance Payments) కింద ఒరాకిల్ ఏకంగా 1.84 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 15,000 కోట్లకు పైగా) ఖర్చు చేసింది. మునుపటి ఆర్థిక సంవత్సరంలో ఈ ఖర్చు కేవలం 374 మిలియన్ డాలర్లు మాత్రమే ఉండటం గమనార్హం. అంటే ఏఐ దిశగా అడుగులు వేసే క్రమంలో కంపెనీపై ఆర్థిక భారం ఎంతలా పెరిగిందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: కస్టమర్ల ఆరోగ్యంతో ఆటలు.. ‘కంచి కేఫ్’, ‘కోడికూర చిట్టిగారే’ రెస్టారెంట్‌లకు నోటీసులు!

Food Safety Raids-Hyderabad: సైబరాబాద్ పరిధిలోని రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు...

Medak Double Murder Case: ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిన EMI.. మెదక్‌లో జంట హత్యల కలకలం..

Medak Double Murder Case: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం సురారం...