16
August, 2026

A News 365Times Venture

16
Sunday
August, 2026

A News 365Times Venture

Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?

Date:

Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్ బడ్జెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొత్త స్మార్ట్‌ఫోన్లలో Redmi Note 17 5G, Moto G Max 5G ప్రధానంగా నిలుస్తున్నాయి. ఈ రెండు ఫోన్లు ప్రీమియం డిజైన్, డ్యూయల్ కెమెరా సెటప్, ఫ్లాట్ డిస్‌ప్లేతో పాటు లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్నాయి. అయితే డిస్‌ప్లే, పనితీరు, కెమెరా, బ్యాటరీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ విషయంలో రెండింటి మధ్య పలు కీలకమైన తేడాలు ఉన్నాయి. మరి వీటిలో ఏది బాగుంటుందో తెలుసుకుందామా..

డిజైన్:

మొదటగా రెడ్ మీ నోట్ 17 5G లో ప్లాస్టిక్ ఫ్రేమ్, ప్లాస్టిక్ బ్యాక్‌తో వస్తుంది. ముందు భాగంలో Gorilla Glass 7i రక్షణ ఉంది. వెనుక భాగంలో రెండు కెమెరాలను చదరపు మాడ్యూల్‌లో నిలువుగా అమర్చారు. సెల్ఫీ కెమెరా ముందు భాగంలో సెంటర్‌లో ఉంటుంది. ఈ ఫోన్‌కు IP65 రేటింగ్ ఉండటంతో దుమ్ము, నీటి నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే ఇది ఆర్కిటిక్ బ్లూ, స్టార్‌లైట్ పర్పుల్, డార్క్ నైట్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మరోవైపు మోటో G మ్యాక్స్ 5G ప్లాస్టిక్ ఫ్రేమ్, గొరిల్లా గ్లాస్ 7i రక్షణ ఉన్న గ్లాస్ ఫ్రంట్‌తో వస్తుంది. దీనికి IP64 రేటింగ్తో పాటు MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ కూడా ఉంది. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరాలతో పాటు అదనపు ఆక్సిలరీ లెన్స్ ఉంటుంది. ముందు భాగంలో పంచ్-హోల్ సెల్ఫీ కెమెరాతో ఫ్లాట్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది అలస్కాన్ బ్లూ, మాలాగా (బుర్గుండి), స్టార్‌గేజర్ (స్లేట్) రంగుల్లో లభిస్తుంది.

డిస్‌ప్లే:

డిస్‌ప్లే విషయంలో రెడ్ మీ నోట్ 17 5G స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. ఇందులో 6.9 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. Gorilla Glass 7i రక్షణ కూడా ఉంది. మరోవైపు మోటో G మ్యాక్స్ 5Gలో 6.72 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే ఉంది. ఇది కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉన్నప్పటికీ.. టచ్ శాంప్లింగ్ రేట్ 120Hzకు పరిమితం. గరిష్టంగా 1050 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ముందు భాగంలో గొరిల్లా గ్లాస్ 7i రక్షణ ఉంటుంది.

ప్రాసెసర్:

రెడ్ మీ లో Qualcomm Snapdragon 4 Gen 4 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది 4nm ఆర్కిటెక్చర్‌పై రూపొందించబడింది. AnTuTu 11లో సుమారు 5,93,849 పాయింట్లు సాధించగా, Geekbench 6లో సింగిల్-కోర్ 950, మల్టీ-కోర్ 2,322 పాయింట్లు సాధించినట్లు పేర్కొంటున్నారు. ఈ చిప్‌సెట్‌కు గరిష్టంగా 8GB LPDDR4X RAM, 128GB వరకు UFS 2.2 స్టోరేజ్ లభిస్తుంది. స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించుకునే అవకాశం కూడా ఉంది. అలాగే మోటో G మ్యాక్స్ 5Gలో మరింత శక్తివంతమైన Snapdragon 6s Gen 4 చిప్‌సెట్‌ను అందించారు. ఇది కూడా 4nm టెక్నాలజీపై రూపొందించబడింది. AnTuTu 11లో సుమారు 8,09,091 పాయింట్లు సాధించగా, Geekbench 6లో సింగిల్-కోర్ 1,009, మల్టీ-కోర్ 2,892 పాయింట్లు నమోదయ్యాయి. ఈ ఫోన్‌లో గరిష్టంగా 8GB LPDDR5X RAM ఉంటుంది. RAM Boost ఫీచర్ ద్వారా దీనిని 18GB వరకు పెంచుకోవచ్చు. అలాగే 256GB వరకు UFS 3.1 స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. పనితీరు పరంగా Moto G Max 5Gకు ఇక్కడ స్పష్టమైన ఆధిక్యం ఉంది.

కెమెరా:

కెమెరా విషయంలో రెండు ఫోన్ల మధ్య భారీ తేడా ఉంది. Redmi Note 17 5Gలో 50MP ప్రధాన కెమెరా ఉంది. ఇందులో 1/2.76-అంగుళాల సెన్సార్, f/1.8 అపెర్చర్ లెన్స్ ఉంటుంది. AI ఆధారిత కెమెరా ఫీచర్లు, డ్యూయల్-వీడియో వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇది f/2.2 అపెర్చర్ లెన్స్‌తో వస్తుంది. అలాగే మోటో G మ్యాక్స్ 5Gలో పెద్ద 1/1.95-అంగుళాల 50MP సోనీ LYTIA 600 మెయిన్ కెమెరా ఉంటుంది. f/1.8 అపెర్చర్‌తో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. ఇది 120-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూను అందిస్తుంది. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. కాబట్టి కెమెరా హార్డ్‌వేర్ పరంగా Moto G Max 5G మరింత కాస్త మెరుగ్గా కనిపిస్తోంది.

బ్యాటరీ, ఛార్జింగ్:

బ్యాటరీ విషయంలో Redmi Note 17 5G ముందంజలో ఉంది. ఇందులో భారీ 8,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంటుంది. ఇది 45W PD 3.0 ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు 22.5W వైర్‌లెస్ ఛార్జింగ్కు కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే Moto G Max 5Gలో 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. ఇది 30W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, Redmi Note 17 5Gకు వైర్‌లెస్ ఛార్జింగ్, వేగవంతమైన వైర్డ్ ఛార్జింగ్ కారణంగా ఇక్కడ ఆధిక్యం లభిస్తుంది.

ఏ ఫోన్ బెస్ట్?

మొత్తంగా చూస్తే రెడ్ మీ నోట్ 17 5G పెద్ద AMOLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీ, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎక్కువ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను కోరుకునే వారికి మంచి ఎంపికగా నిలుస్తుంది. మరోవైపు మోటో G మ్యాక్స్ 5G మరింత శక్తివంతమైన Snapdragon 6s Gen 4 ప్రాసెసర్, మెరుగైన RAM/స్టోరేజ్ టెక్నాలజీ, 50MP Sony మెయిన్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లతో పనితీరు, కెమెరాకు ప్రాధాన్యత ఇచ్చే వారికి బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Guntur Chilli Export: గుంటూరు మిర్చికి శ్రీలంక షాక్.. పదుల సంఖ్యలో కంటైనర్లు రిజెక్ట్!

Guntur Chilli Export Crisis: గుంటూరు మిర్చికి శ్రీలంకలో ఎదురుదెబ్బ తగిలింది....

Nainar Nagendran: సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు బీజేపీ చీఫ్‌పై ఫిర్యాదు!

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ...

West Bengal: కాంగ్రెస్ నేత, కుమారుడి కాల్చివేత.. ఇంటికి వెళ్తున్న సమయంలో దారుణం..

West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో కాంగ్రెస్ నేత, ఆయన...

Javed Akhtar: హిందువులపై పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలు.. “మిస్టర్ 10%” అంటూ జావెద్ అక్తర్ కౌంటర్..

Javed Akhtar: పాకిస్తాన్‌లో హిందూ మైనారిటీలను ఉద్దేశిస్తూ ఆ దేశ అధ్యక్షుడు...