10
June, 2026

A News 365Times Venture

10
Wednesday
June, 2026

A News 365Times Venture

Rajat Patidar: డేవిడ్ వార్నర్ రికార్డ్ ను సమం చేసిన ఆర్సీబీ కెప్టెన్.!

Date:

Rajat Patidar: ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. మంగళవారం ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) పై 92 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఫైనల్‌ లోకి దూసుకెళ్లింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో ఇదే అత్యధిక జట్టు స్కోరు. ఇదివరకు 2023 క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్‌పై చేసిన 233/3 రికార్డును ఆర్సీబీ బద్దలు కొట్టింది.

ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ అద్భుత ఇన్నింగ్స్‌తో సంచలనం సృష్టించాడు. మొదట 13 బంతుల్లో 21 పరుగులతో నెమ్మదిగా ఆడిన పటీదార్, ఆ తర్వాత గుజరాత్ బౌలర్లపై శివతాండవం సృష్టించాడు. చివరి 20 బంతుల్లోనే 72 పరుగులు రాబట్టి.. మొత్తం 33 బంతుల్లో అజేయంగా 93 పరుగులు చేశాడు. పటీదార్ ఈ ఇన్నింగ్స్‌తో ఓ అరుదైన రికార్డును కూడా సమం చేశాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ సరసన నిలిచాడు. వార్నర్ 2016 క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 93 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్స్ ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు చేతులెత్తేశారు. ఇన్నింగ్స్ మొదటి నుంచే వికెట్లు కోల్పోతూ ఒత్తిడిలో పడిన గుజరాత్, ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. దీంతో ఆర్సీబీ సునాయాసంగా 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ ఐపీఎల్ 2026 ఫైనల్ కు చేరి టైటిల్ ఫేవరెట్‌గా మారింది. దీనికి కారణం చరిత్ర కూడా ఇప్పుడు ఆర్సీబీకే అనుకూలంగా ఉంది. 2018 నుంచి ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ప్రతి జట్టు కూడా క్వాలిఫయర్-1 గెలిచిన జట్టే. గత ఏడాది కూడా ఆర్సీబీ క్వాలిఫయర్-1లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి, అనంతరం ఫైనల్లో విజయం సాధించి తమ తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.

మొత్తంగా 2011లో ప్లేఆఫ్స్ వ్యవస్థ వచ్చినప్పటినుండి 15 సీజన్లలో 12 సార్లు క్వాలిఫయర్-1 గెలిచిన జట్టే చివరికి ఛాంపియన్‌గా నిలిచింది. కేవలం మూడు సార్లు మాత్రమే ఆ జట్లు ఫైనల్లో ఓడిపోయాయి. అందులో 2016లో ఆర్సీబీ కూడా ఒకటి. అప్పట్లో క్వాలిఫయర్-1 గెలిచినా, ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో పరాజయం పాలైంది. చూడాలిమరి ఈసారి పరిస్థి ఎలా ఉండబోతుందో.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ఎందుకు విఫలమయ్యాడు? ఒక షాట్.. ఒక తప్పిదం.. వైభవ్‌కు విలువైన పాఠం..!

Vaibhav Sooryavanshi: శ్రీలంకలో జరుగుతున్న ట్రై-సిరీస్‌లో ఇండియా ‘ఎ’ జట్టుకు ప్రాతినిధ్యం...

Modi-Meloni: ఇటీవల రోమ్‌లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్‌పై మెలోని అభినందనలు

ప్రధాని మోడీ చరిత్ర సృష్టించారు. ఏకధాటిగా దేశాన్ని 12 ఏళ్ల పాటు...

రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..

Realme P4R 5G Launch: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యువతను లక్ష్యంగా చేసుకుని...

Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..

Vizag: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య...