15
September, 2026

A News 365Times Venture

15
Tuesday
September, 2026

A News 365Times Venture

Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం

Date:

రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యం చెలాయించింది. చిన్న పట్టణాలు, గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం అందుకుంది. రైతులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో స్వతంత్ర అభ్యర్థులు బలం పుంజుకున్నారు. రాష్ట్రంలోని 10 మున్సిపల్ కార్పొరేషన్లలో ఆసక్తికరమైన పరిస్థితి తలెత్తింది. 10 మున్సిపల్ కార్పొరేషన్లలో ఐదింటిని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గెలుచుకోగా.. ఒకదానిని కాంగ్రెస్ గెలుచుకుంది. నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లలో హంగ్ తీర్పు కొనసాగుతోంది.

మున్సిపాలిటీ- 252
బీజేపీ-144
కాంగ్రెస్ -92
స్వతంత్రులు – 16

మున్సిపల్ కౌన్సిల్-47
బీజేపీ-21
కాంగ్రెస్ -17
స్వతంత్రులు – 9

ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి అనేక కీలక అంశాలు దోహదపడ్డాయి. యువతకు ఉద్యోగాలు కల్పించడం, పేపర్ లీక్‌లను నివారించడం వల్లే భజన్ లాల్ ప్రభుత్వం విజయం సాధించిందని భావిస్తున్నారు. అయితే ప్రధాన నగరాల్లో యూజీసీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు పార్టీ పనితీరుపై ప్రభావం చూపాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పేలవమైన పనితీరును కనబరిచింది. బీజేపీ వ్యతిరేక సెంటిమెంట్‌పై ఎక్కువగా ఆధారపడిందని, ఎన్నికలలో పూర్తిగా నిమగ్నం కాలేదని అంటున్నారు. అంతేకాకుండా అంతర్గత విభేదాలు, నీట్ పేపర్ లీక్, యువత సమస్యలపై మౌనం వహించడం వంటివన్నీ పార్టీ ఓటమికి దోహదపడ్డాయి.

రాజస్థాన్ పురపాలక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 4,000కు పైగా వార్డులను గెలుచుకుని అద్భుతమైన విజయాన్ని సాధించింది. మరోవైపు, కాంగ్రెస్ 3,450కి పైగా వార్డులలో విజయం సాధించగా, స్వతంత్ర అభ్యర్థులు 2,400కు పైగా స్థానాలను గెలుచుకున్నారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నియోజకవర్గమైన బికనీర్‌లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు వసుంధరా రాజే నియోజకవర్గమైన ఝలావర్‌లో కూడా ఆ పార్టీ ఓటమి పాలైంది.

ఇదిలా ఉండగా రాజస్థాన్‌లోని దీద్వానా-కుచమన్ జిల్లాలో జరిగిన పర్బత్సర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితం చర్చనీయాంశంగా మారింది. వివిధ వార్డులలో, భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్‌పి) అభ్యర్థులకు చెరొక ఓటు మాత్రమే లభించింది. ఆసక్తికరంగా బీజేపీ అభ్యర్థి కైలాష్ చంద్ర తాను పోటీ చేసిన వార్డులోనే ఒక్క ఓటు కూడా పొందలేదు.

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయాన్ని ఆయన చారిత్రాత్మకమైనదిగా, అద్భుతమైనదిగా అభివర్ణించారు. రాజస్థాన్ ప్రజలకు, బీజేపీ కార్యకర్తలందరికీ తాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని సీఎం భజన్ లాల్ అన్నారు. పార్టీ కార్యకర్తల కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.

సీఎం యోగి అభినందనలు 

రాజస్థాన్ పట్టణ సంస్థల ఎన్నికలలో బీజేపీ సాధించిన అద్భుత విజయానికి కష్టపడిన కార్యకర్తలందరికీ హృదయపూర్వక అభినందనలు, రాజస్థాన్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియాలో రాశారు. ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో, ముఖ్యమంత్రి భజన్ లాల్ నాయకత్వంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సేవ అనే విధానానికి ఈ చారిత్రాత్మక తీర్పు ప్రజల ఆమోద ముద్ర అని ఆయన రాశారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన

ఉక్రెయిన్- రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు...

Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..

భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా తన ‘విరాట్’ సిరీస్‌లో భాగంగా...

Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్‌పింగ్.. బ్రిక్స్‌పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..

Ravi Shastri: న్యూఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన బ్రిక్స్...

Dinesh Karthik: టెస్టు క్రికెట్‌ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..

ఇంగ్లండ్‌లో 0-3 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయి స్వదేశానికి తిరిగొచ్చిన పాకిస్థాన్...