మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ‘ఠాగూర్’ సినిమా ఒక మైలురాయి. అవినీతిపై పోరాడే ఒక ప్రొఫెసర్ పాత్రలో చిరంజీవి నటన, వినాయక్ దర్శకత్వం ఈ చిత్రాన్ని ఇండస్ట్రీ హిట్ చేశాయి. అయితే, ఈ సినిమా అసలు కథానాయకుడు చిరంజీవి కాదు, రాజశేఖర్ అని మీకు తెలుసా? తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజశేఖర్ ఈ విషయంపై స్పందిస్తూ సంచలన విషయాలు వెల్లడించారు.
Also Read : Darling Re-Release: బాక్సాఫీస్ వద్ద ‘డార్లింగ్’ సరికొత్త రికార్డు!
తమిళంలో మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ కాంత్ నటించిన ‘రమణ’ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా కథ విన్నప్పుడే రాజశేఖర్ తనకు బాగా నచ్చడంతో, దీని తెలుగు రీమేక్ హక్కులను తానే స్వయంగా తీసుకోవాలని అనుకున్నారట. “ఠాగూర్ సినిమా నాదే.. ఆ కథను నేను ఎంతగానో ప్రేమించాను” అని ఆయన ఈ వీడియోలో పేర్కొన్నారు. రాజశేఖర్ ఆ హక్కుల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే, కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ చిరంజీవి, నిర్మాత మధు దగ్గరకు వెళ్లిందని ఆయన వివరించారు..‘ఆ సినిమా నేను చేసుంటే నా కెరీర్ మరోలా ఉండేది. కానీ చిరంజీవి గారు ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడం నాకు సంతోషమే, కానీ నా చేతుల్లోంచి ఆ అవకాశం చేజారిపోవడం అప్పట్లో కొంత బాధ కలిగించింది’ అని రాజశేఖర్ ఎమోషనల్ అయ్యారు.




