26
November, 2026

A News 365Times Venture

26
Thursday
November, 2026

A News 365Times Venture

Rahul Gandhi: “నాన్నను చంపడానికే భద్రతను తొలగించారు”: రాజీవ్ గాంధీ హత్యపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ!

Date:

Rahul Gandhi: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రిని చంపాలనే ఉద్దేశంతోనే అప్పట్లో ఆయనకు ఉన్న భద్రతను తొలగించారని, అది అనుకోకుండా జరిగిన పొరపాటు కాదని రాహుల్ వ్యాఖ్యానించారు. తన తల్లి సోనియాగాంధీ రాసిన జ్ఞాపకాల పుస్తకం ‘బిలాంగింగ్’ (Belonging) గురించి సోనియా, సోదరి ప్రియాంక గాంధీలతో కలిసి మాట్లాడిన ఒక ప్రత్యేక వీడియోలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

బీహార్ పర్యటనలోనే హెచ్చరించా..

1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత ప్రధాని బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ, 1989 ఎన్నికల్లో ఓటమిపాలై ప్రతిపక్ష నేతగా మారారు. ఆ సమయంలో ఆయనకున్న కమాండో భద్రతను తగ్గించడంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 1991 నెలలో శ్రీపెరంబదూర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడికి ముందు రాజీవ్ గాంధీతో కలిసి బీహార్ ఎన్నికల ప్రచారానికి రాహుల్ కూడా వెళ్లారు. ఆ పర్యటన అత్యంత భయానకంగా సాగిందని సోనియా గాంధీ గుర్తుచేసుకున్నారు. ఓపెన్ టాప్ జీపులో ప్రచారం చేస్తున్న సమయంలో కొందరు రాళ్లు విసిరారని, ఆయన భద్రత విషయంలో అప్పటి బీహార్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఆ పర్యటన తర్వా త రాహుల్ నాతో ..‘‘అమ్మా, నాన్న భద్రత విషయంలో మనం ఏదో ఒకటి చేయకపోతే, త్వరలోనే ఆయన అంత్యక్రియలకు రావాల్సి వస్తుంది’’ అని చెప్పినట్లు సోనియా గాంధీ గుర్తుచేసుకున్నారు.

తండ్రిని చంపడానికే భద్రత తొలగించారు..

రాహుల్ గాంధీ ఆ సమయంలో ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దికాలానికే 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడిలో హత్య చేశారు. దీనిపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. బీహార్ పర్యటన నా అనుమానాలను నిజం చేసిందని, నాన్నను చంపడానికే భద్రతను తొలగించారని, అది యాదృచ్ఛికం కాదని, పక్కా ప్రణాళికతో హత్యకు అనుకూలమైన వాతావరణ సృష్టించారని ఆరోపించారు. ఈ విషయంపై తాను అమ్మతోనే కాదు, నాన్నతో కూడా వాదించినట్లు రాహుల్ పేర్కొన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Thiruparankundram Deepam Controversy: కార్తీక దీపం వివాదంలో మరో ట్విస్ట్…! గవర్నర్ సీరియస్.. సీఎం విజయ్‌కు కీలక ఆదేశాలు!

Thiruparankundram Deepam Controversy: తమిళనాడులోని తిరుపరంకుండ్రం కార్తీక దీపం వివాదం మరోసారి...

CM Chandrababu: గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం చంద్రబాబు.. రేషన్ షాపుల్లో తక్కువ ధరకే కందిపప్పు, పామాయిల్..

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి సామాన్య ప్రజలపై...

Trump Tariffs: ట్రంప్ టారిఫ్ బాంబ్.. భారత్‌పై 25, చైనాకు 40 శాతం..

అమెరికా వాణిజ్య ప్రతినిధి కొత్త ప్రణాళిక ప్రకారం భారత్‌తో పాటు మరికొన్ని...