9
October, 2026

A News 365Times Venture

9
Friday
October, 2026

A News 365Times Venture

Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!

Date:

Rahul Gandhi: భారత్‌లో తన స్టార్‌లింక్ అనుమతులకు జాప్యం ఏర్పడుతుందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్ర ఆరోపనలు చేయడం సంచలనంగా మారింది. ఇదే కాకుండా..‘‘భారత్‌కు నిజమైన బాస్ అంబానీనా?’’ అంటూ ఆయన ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘వెల్‌కమ్ టూ ఇండియా ఎలాన్, మరొక వ్యక్తి ఎవరో తెలిసే వరకు వేచి చూడండి’’ అంటూ కామెంట్ చేశారు.

అయితే, ఆ మరో వ్యక్తి ఎవరనేది రాహుల్ గాంధీ ప్రస్తావించలేదు. కానీ, ఈ వ్యాఖ్యలు గౌతమ్ అదానీని ఉద్దేశించినవని చాలా మంది అనుకుంటున్నారు. చాలాసార్లు రాహుల్ గాంధీ అంబానీ, అదానీలను టార్గెట్ చేస్తూ విమర్శించారు. అదానీకి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తారని కాంగ్రెస్ గతంలో పలుమార్లు ఆరోపించింది.

ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ‘‘థాంక్యూ రాహుల్. ఇది నిజంగా ఆందోళనకరమైన విషయం’’ అని రిప్లై ఇచ్చారు. దీనికి ముందు ఎలాన్ మస్క్ భారత్‌లో స్టార్‌లింక్ అనుమతులు రావడంపై మస్క్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ సంస్థ 165కిపైగా దేశాల్లో లైసెన్స్ పొందిందని, భారత్‌లోని చట్టాలు, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఐదేళ్లుగా పనిచేస్తున్నప్పటికీ ఇంకా లైసెన్స్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ‘‘అంబానీయే భారత్‌కు అసలైన బాస్‌నా?’’ అని ఎక్స్‌లో ప్రశ్నించారు.

దీనికి ముందు మరో పోస్టులో భారత్‌లో స్టార్‌లింక్ ప్రవేశాన్ని కొంతమంది ‘‘ఒలిగార్కుల’’ అడ్డుకుంటున్నారని, తమ గుత్తాధిపత్య ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఇలా చేస్తున్నారని మస్క్ ఆరోపించారు. అయితే, మస్క్ ఆరోపణల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల అనుమతుల వ్యవస్థ న్యాయమైందని, వివక్ష లేదని స్పష్టం చేసింది. భారత్ స్టార్‌లింక్‌తో పాటు రిలయన్స్ జియో యొక్క శాటిలైట్ వెంచర్ జియో సాట్‌కామ్ మరియు భారతి మద్దతు ఉన్న యూటెల్‌శాట్ వన్‌వెబ్‌లకు లైసెన్సులు మంజూరు చేసింది. అయితే, వీటికి అవసరమైన భద్రతా అంచనాలు, స్పెక్ట్రమ్ ఆమోదాలు పూర్తయ్యే వరకు వాణిజ్య సేవలు ప్రారంభించలేవు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత

Saudi Arabia: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ గురువారం వరుస పేలుళ్లతో...

Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!

Elon Musk: ప్రపంచ కుబేరుడు భారత్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు....

Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన

సౌదీపై హౌతీల దాడులు తీవ్రమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది....

US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!

అమెరికాలోని ప్రముఖ ఐటీ కంపెనీలకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది....