2
June, 2026

A News 365Times Venture

2
Tuesday
June, 2026

A News 365Times Venture

PM Modi: మరో రికార్డ్ దిశగా మోడీ.. 7 రోజుల్లో సరికొత్త చరిత్ర

Date:

ప్రధాని మోడీ మరో రికార్డ్‌ను సృష్టించబోతున్నారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డ్‌ను సొంతం చేసుకోబోతున్నారు. మరో ఏడు రోజుల్లో దివంగత మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మీద నెలకొన్న రికార్డును బద్దలుకొట్టనున్నారు. వరుసగా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన నెహ్రూ రికార్డ్‌ను మోడీ అధిగమించనున్నారు.

మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఏకధాటిగా 4397 రోజుల పాటు.. అనగా 12 సంవత్సరాల 14 రోజుల పాటు ప్రధానిగా పని చేశారు. ఇప్పుడు ఆ రికార్డ్‌ను ప్రధాని మోడీ జూన్ 9న అధిగమించనున్నారు. ఈనెల 9న 4,398 రోజుల పాటు వరుసగా అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును మోడీ సొంతం చేసుకోబోతున్నారు. జూన్ 9న మూడవ పర్యాయం రెండేళ్లు పూర్తికానున్నాయి. ఈ చారిత్రాత్మక ఘనత సాధించినందుకు ప్రధాని మోడీని అభినందిస్తూ.. జూన్ 10న ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా ఒక తీర్మానాన్ని ఆమోదించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇతర మిత్రపక్షాల నాయకులు ఈ తీర్మానానికి మద్దతు తెలపనున్నారు. ప్రధానమంత్రిగా గడిచిన పన్నెండేళ్లలో సాధించిన విజయాలను ఈ తీర్మానం ప్రముఖంగా హైలెట్ చేయనుంది.

నెహ్రూ రికార్డు
భారతదేశ తొలి ప్రధానమంత్రిగా జవహర్‌లాల్ నెహ్రూ.. 1952 మే 13న తొలిసారిగా ఎన్నికైన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆనాటి నుంచి ప్రధానమంత్రిగా వరుసగా 4,397 రోజులు.. అనగా 12 సంవత్సరాల 14 రోజులు పనిచేశారు. వాస్తవానికి నెహ్రూ 1947 ఆగస్టు 15న ప్రధానమంత్రి అయినప్పటికీ.. తొలి లోక్‌సభ ఎన్నికల వరకు ప్రధానిగా కాకుండా.. మధ్యంతర ప్రభుత్వానికి అధిపతిగా పని చేశారు. 1964 మే 27న మరణించే వరకు ప్రధానమంత్రిగా కొనసాగారు. ఈ పూర్తి పదవీ కాలాన్ని కలిపితే 6,130 రోజులవుతాయి. కానీ ఇందులో మధ్యంతర ప్రభుత్వానికి పని చేసిన 1,733 రోజులు ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే 6,130 రోజులవుతాయి. కానీ అధికారికంగా ప్రధానిగా ఎన్నికైన తర్వాత మాత్రం 4,397 రోజులు.. అనగా 12 సంవత్సరాల 14 రోజులు పనిచేశారు.

మోడీ రికార్డ్
ఇక ప్రధాని మోడీ పేరిట అనేక రికార్డ్‌లు ఉన్నాయి. అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పని చేసిన తొలి కాంగ్రెసేతర వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఇక వాజ్‌పేయ్‌ పేరిట ఉన్న 2,272 రోజుల రికార్డ్‌ను అధిగమించారు. ఇక వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోడీనే కావడం విశేషం. ఇప్పుడు 2014లో ప్రధానిగా ఎన్నికైన దగ్గర నుంచి ఏకధాటిగా పని చేసిన రికార్డ్‌ను ఇప్పుడు సొంతం చేసుకోబోతున్నారు.

ఇక 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పటి నుంచి నిరంతరాయంగా ప్రభుత్వ అధినేతగా పని చేస్తున్నారు. 2001 అక్టోబర్ 7 నుంచి 2014 మే 22 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేశారు. అనంతరం 2014 మే 26 నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రిగా పని చేస్తున్నారు. ఈ విధంగా మోడీ ఎన్నికైన ప్రభుత్వాలకు అధినేతగా 9,000 రోజులు పూర్తి చేశారు. దేశ చరిత్రలో ఇలాంటి రికార్డ్ ఎవరికీ లేదు. ప్రస్తుతం మోడీకి మాత్రమే సొంతం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Team India Spin Bowling Coach: 630 వికెట్ల వీరుడికి బీసీసీఐ గౌరవం.. స్పిన్ బౌలింగ్ కోచ్‌గా ఎంపిక

Team India Spin Bowling Coach:భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)...

DK.Shivakumar: రేపే సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణం.. కేబినెట్‌‌లో వీరికి బెర్త్ కన్ఫాం!

కర్ణాటకలో రేపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం...

West Bengal Politics: మమతా పార్టీలో ‘‘షిండే’’ రాజకీయాలు.. తృణమూల్‌లో తీవ్ర సంక్షోభం..

West Bengal Politics: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలుపు, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)...

ICC: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌లో భారీ మార్పు.. డే టెస్టుల్లో పింక్ బాల్ ట్రయల్.!

ICC: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మహిళల క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న...