20
May, 2026

A News 365Times Venture

20
Wednesday
May, 2026

A News 365Times Venture

PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ

Date:

భారత్-నార్వే దేశాలు ప్రపంచంలోని శాంతిని ఆకాంక్షిస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా మోడీ నార్వేలో పర్యటిస్తున్నారు. నార్డిక్ దేశాల నాయకులతో కలిసి నిర్వహించిన సంయుక్త పత్రికా సమావేశంలో మోడీ మాట్లాడారు.

E

భారత్-నార్వే సంబంధాలు అవకాశాలతో నిండి ఉన్నాయని… ప్రపంచంలో శాంతిని ఆకాంక్షిస్తున్నామని.. భారతదేశంతో సంబంధాలు, వాణిజ్యం, ఆవిష్కరణల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఉగ్రవాదం విషయంలో తాను రాజీపడబోనని మోడీ పేర్కొన్నారు.

‘‘ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, బహుపాక్షికవాదం పట్ల మన పరస్పర నిబద్ధత మనల్ని సహజ భాగస్వాములుగా చేస్తుంది. అదే సమయంలో సాంకేతికత, సుస్థిరత రంగాల్లో మన ఉమ్మడి ప్రాధాన్యతలు కలిసి పనిచేయడానికి అపారమైన అవకాశాలను అందిస్తున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నార్డిక్ దేశాలతో మన సంబంధాలను వేగవంతం చేయడానికి, బలోపేతం చేయడానికి ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ ఫార్మాట్‌ను రూపొందించాం’’ అని అన్నారు.

‘‘గత కొన్నేళ్లుగా మన సంబంధాల్లో గణనీయమైన పురోగతి సాధించాం. పదేళ్లలో మన ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. భారతదేశ వేగవంతమైన వృద్ధిలో నార్డిక్ దేశాల పెట్టుబడి నిధులు కూడా ముఖ్యమైన భాగస్వాములుగా మారుతున్నాయి. గత దశాబ్దంలో భారతదేశంలోకి నార్డిక్ దేశాల పెట్టుబడులు దాదాపు 200 శాతం పెరిగాయి.’’ అని తెలిపారు.

‘‘నార్వే, ఐస్‌లాండ్, ఇతర ఈఎఫ్‌టీఏ దేశాలతో కలిసి అక్టోబర్ 2025 నుంచి వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని అమలు చేశాం. అంతేకాక కొన్ని నెలల క్రితమే భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాం. ఇందులో డెన్మార్క్, ఫిన్లాండ్, స్వీడన్ కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక వాణిజ్య ఒప్పందాలతో, భారత్-నార్డిక్ దేశాల మధ్య సంబంధాలలో ఒక కొత్త స్వర్ణయుగాన్ని ప్రారంభించబోతున్నాం.’’ అని చెప్పుకొచ్చారు.

‘‘ప్రపంచ ఉద్రిక్తతలు, సంఘర్షణలు నెలకొన్న ఈ యుగంలో భారతదేశం-నార్డిక్ దేశాలు నియమాల ఆధారిత ప్రపంచ వ్యవస్థను బలోపేతం చేయడం కొనసాగిస్తాయి. అది ఉక్రెయిన్ అయినా.. పశ్చిమాసియా అయినా.. సంఘర్షణలకు త్వరితగతిన ముగింపు పలికి శాంతిని నెలకొల్పే ప్రయత్నాలకు మేము మద్దతు ఇవ్వడం కొనసాగిస్తాం. బహుళపక్ష సంస్థల సంస్కరణలు అవసరమని, అత్యవసరమని మేము అంగీకరిస్తున్నాము. ఉగ్రవాదం విషయంలో కూడా మాకు స్పష్టమైన, స్థిరమైన వైఖరి ఉంది. రాజీ లేదు. ద్వంద్వ ప్రమాణాలు లేవు. ఈ రోజు నేను ‘సంబంధ్’ అనే పదాన్ని చాలాసార్లు ఉపయోగించాను. అనేక నార్డిక్ భాషలలో ‘సంబంధ్’ అనే పదానికి అనుబంధం, సంబంధం, బంధం అని అర్థం. హిందీలో కూడా ‘సంబంధ్’కు అదే అర్థం ఉంది. ఇది కేవలం పదాల సారూప్యత మాత్రమే కాదు. ఇది మన ఆలోచనల సాన్నిహిత్యాన్ని ప్రతిబింబిస్తుంది.’’ అని మోడీ పేర్కొన్నారు.

 



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..

AP Heatwave Alert: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని రాష్ట్ర...

Chairmans Desk : ప్రపంచమంతా మాంద్యం గుప్పిట్లో ఉంటే.. దక్షిణాది మాత్రం సేఫ్ జోన్లోనే ఉందా..? |

కరోనా తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతకు ముందు స్థితికి చేరనేలేదు....

RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌లో భాగంగా జైపూర్‌లోని సవాయ్...

Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..

ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో  లక్నో...