6
September, 2026

A News 365Times Venture

6
Sunday
September, 2026

A News 365Times Venture

PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు

Date:

PM Modi: భారత తాజా జీడీపీ గణాంకాలపై విమర్శలు చేస్తున్న వారికి ప్రధాని నరేంద్ర మోడీ ఘాటుగా సమాధానం ఇచ్చారు. భారత్ 7.8 శాతం త్రైమాసికి వృద్ధిరేటును కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. 2013లో ‘‘ఫ్రాజైల్ ఫైవ్’’లో ఉన్న భారత్‌ను ఇప్పుడు ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చామని అన్నారు. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) శతాబ్ది వేడుకల్లో శనివారం మోదీ ప్రసంగించారు.

2013లో భారత్‌ను ప్రపంచంలోనే ‘‘ఫ్రాజైల్ ఫైవ్’’గా భావించేవారని, ప్రపంచ ఆర్థిక షాక్‌లకు గురయ్యే ఐదు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఉండేదని, ఇప్పుడు వారే 7.8 శాతం వృద్ధి రేటను జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. 2013లో భారత్‌పై ప్రతికూల దృక్పథంతో ఉన్నారు ఇప్పటికే అదే వైఖరితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘‘వారికి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీగానే ఉంటుంది. నేను గ్లాస్ గురించే మాట్లాడుతున్నాను. మరేదైనా ఖాళీగా ఉండటం గురించి కాదు’’ అంటూ సెటైర్లు వేశారు. భారత్ ఎంత మంచి స్థితిలో ఉన్నా కొందరు లోపాలు వెతుకుతూనే ఉంటారనే అర్థంతో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

2013లో తాను SRCCలో చేసిన ప్రసంగంలో ‘‘హాఫ్ ఫిల్లడ్ గ్లాస్’’ను మరోసారి ప్రస్తావించారు. అప్పట్లో కొందరు గ్లాస్ సగం నిండి ఉన్నట్లు, మరికొందరు సగం ఖాళీగా ఉన్నట్లు చూస్తారని, తాను మాత్రం దాన్ని పూర్తిగా నిండిన గ్లాస్‌గా చూస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 2013 నాటి ఆర్థిక పరిస్థితుల్ని ప్రస్తావిస్తూ.. బలహీనమైన రూపాయి, దాదాపుగా 10 శాతం ద్రవ్యోల్బణం, రికార్డ్ స్థాయి కరెంట్ అకౌంట్ లోటు, పారిశ్రామిక వృద్ధి మందగించడం, అవినీతి ఆరోపణలు, ‘పాలసీ ప్యారలసిస్’ వంటి అంశాలను మోదీ ప్రస్తావించారు. మేక్ ఇన్ ఇండియానున అప్పట్లో చాలా మంది ఎగతాళి చేశారని, 2014లో భారత్ తనకు అవసరమైన మొబైల్ ఫోటన్లలో ఎక్కువ భాగాలను దిగుమతి చేసుకునేదని, ఇప్పుడు రూ. 2.5 లక్షల కోట్లకు పైగా విలువైన మొబైల్ హ్యాండ్ సెట్లను ఎగుమతి చేసే స్థాయికి చేరిందని మోడీ పేర్కొన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

CM Revanth Reddy: శాసనసభలో చర్చిద్దామా..? బీఆర్ఎస్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేసిన సీఎం రేవంత్..

నకిరేకల్ వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!

బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి...

Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొత్త నిబంధనలు.. నామినేషన్ డిపాజిట్లు ఖరారు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం కొత్త నిబంధనలను...