6
September, 2026

A News 365Times Venture

6
Sunday
September, 2026

A News 365Times Venture

PM Modi: మెట్రోలో ప్రధాని మోడీ ప్రయాణం.. పిల్లలతో సంభాషణ

Date:

ప్రధాని మోడీ సామాన్యుడిలా మారిపోయారు. భద్రతా సిబ్బందిని పక్కన పెట్టి ప్రజలతో మమేకం అయిపోయారు. రొటిన్‌కు భిన్నంగా శనివారం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి సందడి చేశారు. శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ (SRCC) శతాబ్ది వేడుకల్లో పాల్గొనేందుకు మెట్రోలో ప్రయాణించి కాలేజీకి వెళ్లారు. చేతిలో మెట్రో కార్డు పట్టుకుని ప్రయాణించిన ప్రధాని.. మార్గమధ్యంలో విద్యార్థులు, తోటి ప్రయాణికులతో సరాదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

మెట్రోలో మోడీ ముచ్చట్లు

SRCC 100వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రసంగించేందుకు వెళ్లిన ప్రధాని మోడీ.. సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా మెట్రోలో ఉన్న చిన్నారులతో…విద్యార్థులతో.. ఇతర ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రతిరోజూ ఢిల్లీ మెట్రోలో కనిపించే సాధారణ దృశ్యానికి.. ప్రధాని మోడీ ప్రయాణం ప్రత్యేకతను తీసుకొచ్చింది. కాలేజీకి చేరుకునే క్రమంలో ఆయన పలువురితో ఆప్యాయంగా మాట్లాడారు.

SRCCకి 100 ఏళ్లు

ప్రధాని మోడీ హాజరవుతున్న ఈ కార్యక్రమం SRCCకి ఎంతో ప్రత్యేకమైనది. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ తన 100 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. SRCC శతాబ్ది వేడుకలకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ వేడుకలు జరుగుతున్నాయి. ప్రస్తుత విద్యార్థులతో పాటు కాలేజీ మాజీ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంతో SRCC శతాబ్ది వేడుకలు పలు తరాల విద్యార్థులు, అధ్యాపకులను ఒకే వేదికపైకి తీసుకువస్తున్నాయి.

13 ఏళ్ల తర్వాత మళ్లీ కాలేజీలోకి..

SRCCలో ప్రధాని మోడీ పర్యటించడం 13 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఆయన చివరిసారిగా 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో SRCCని సందర్శించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో SRCC శతాబ్ది వేడుకల సందర్భంగా కాలేజీ గవర్నింగ్ బాడీ, ప్రతినిధి బృందాన్ని ప్రధాని మోడీ తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా SRCC 100 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ ప్రత్యేక తపాలా బిళ్లను కూడా విడుదల చేశారు. ఇప్పుడు నెలల తర్వాత ప్రధాని స్వయంగా SRCCకి చేరుకున్నారు. మెట్రో కార్డు చేతిలో పట్టుకుని విద్యార్థులు, ప్రయాణికులతో ముచ్చటిస్తూ ఆయన చేసిన ఈ ప్రయాణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

#WATCH | Delhi: Prime Minister Narendra Modi traveled by the Delhi Metro today as he headed to Shri Ram College of Commerce (SRCC) to participate in the college's centenary celebrations.

(Source: DD) pic.twitter.com/AVqtS38z6P
— ANI (@ANI) September 5, 2026

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Pappu Yadav: భారీగా సన్నబడ్డ పప్పు యాదవ్‌.. గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు

పప్పు యాదవ్‌.. స్వతంత్ర ఎంపీ. బీహార్‌లోని పూర్నియా లోక్‌సభ నియోజకవర్గం నుంచి...

CM Revanth Reddy: శాసనసభలో చర్చిద్దామా..? బీఆర్ఎస్‌కు ఓపెన్ ఛాలెంజ్ చేసిన సీఎం రేవంత్..

నకిరేకల్ వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!

బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్‌లోని మండి...