6
October, 2026

A News 365Times Venture

6
Tuesday
October, 2026

A News 365Times Venture

Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్‌ టిప్స్‌..

Date:

Plastic Bucket Cleaning Tips: ఇంట్లో, బాత్‌రూమ్‌లో నిత్యం ఉపయోగించే ప్లాస్టిక్ బకెట్లు, మగ్గులు కొంతకాలం తర్వాత తెల్లటి లేదా పసుపు రంగు పొరతో మురికిగా కనిపిస్తుంటాయి.. రెగ్యులర్‌గా వాటిని శుభ్రం చేసే ప్రయ్నం చేసినా.. వాటిపై ఉన్న జిడ్డు మరకలు తొలగిపోవు.. సబ్బు, డిటర్జెంట్‌తో ఎన్నిసార్లు శుభ్రం చేసినా ఈ మరకలు పూర్తిగా పోవు. ముఖ్యంగా ఉప్పు లేదా కఠిన నీటిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు బకెట్ ఉపరితలంపై పేరుకుపోవడం వల్ల ఈ పొర ఏర్పడుతుంది. ఈ మరకలను తొలగించేందుకు గంటల తరబడి బకెట్‌ను బలంగా రుద్దాల్సిన అవసరం లేదు. ఇంట్లో సులభంగా లభించే కొన్ని పదార్థాలతోనే మొండి ఖనిజపు మరకలను తొలగించవచ్చు.

వెనిగర్, బేకింగ్ సోడాతో సులభంగా శుభ్రం
బకెట్‌పై మరకలు ఎక్కువగా పాతవి కాకపోతే తెల్ల వెనిగర్, బేకింగ్ సోడా ఉపయోగించవచ్చు. రెండు టీస్పూన్ల బేకింగ్ సోడాను సుమారు అర కప్పు తెల్ల వెనిగర్‌తో కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్పాంజ్, గుడ్డ లేదా పాత టూత్‌బ్రష్‌తో మరకలు ఉన్న ప్రాంతాల్లో రాయాలి. 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత స్క్రబ్బర్‌తో మెల్లగా రుద్ది, శుభ్రమైన నీటితో కడగాలి.

నిమ్మరసం, ఉప్పుతో తెల్లటి మరకలకు చెక్
మరకలు తేలికగా ఉన్నప్పుడు నిమ్మరసం, ఉప్పు కూడా మంచి ఎంపిక. నిమ్మకాయను సగానికి కోసి, దాని కోసిన భాగానికి కొద్దిగా ఉప్పు రాసి మరకలు ఉన్న ప్రాంతాల్లో రుద్దాలి. మొండి మరకలు ఉంటే ముందుగా నిమ్మరసం రాసి సుమారు 10 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత స్క్రబ్బర్‌తో మెల్లగా శుభ్రం చేసి నీటితో కడగాలి. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ ఖనిజ నిక్షేపాలను వదులు చేయడంలో సహాయపడుతుంది.

చాలా పాత మరకలకు సిట్రిక్ యాసిడ్
బకెట్‌పై చాలా కాలంగా పేరుకుపోయిన మందపాటి ఖనిజపు పొర ఉంటే సిట్రిక్ యాసిడ్ ఉపయోగించవచ్చు. గోరువెచ్చని నీటితో బకెట్‌ను నింపి అందులో 2 నుంచి 3 టీస్పూన్ల సిట్రిక్ యాసిడ్ పొడి వేసి బాగా కలపాలి. ఈ ద్రావణాన్ని సుమారు 30 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత నీటిని తొలగించి, స్క్రబ్బర్‌తో కొద్దిగా డిష్‌వాషింగ్ లిక్విడ్ ఉపయోగించి శుభ్రం చేయాలి. చివరగా శుభ్రమైన నీటితో బాగా కడగాలి.

మరకలు మళ్లీ రాకుండా ఇలా చేయండి
బకెట్‌పై ఖనిజపు పొర మళ్లీ ఏర్పడకుండా ఉండాలంటే ఉపయోగించిన తర్వాత అందులో నీరు నిల్వ ఉండకుండా పూర్తిగా ఖాళీ చేయాలి. బకెట్‌ను తలకిందులుగా ఉంచడం మంచిది. ఉపరితలంపై నీటి చుక్కులు ఎక్కువసేపు ఉండకుండా చూసుకుంటే మరకలుగా మారి.. అవి మొండివాటిలా మారకుండా తగ్గించవచ్చు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..

అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించి ప్రపంచంలోనే...

Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు

ముంబైలోని బృహన్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ బస్ డిపోలో సోమవారం...

Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..

తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు డిస్కంలు షాకిచ్చాయి. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలైన...

Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?

Off The Record: తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల...