31
August, 2026

A News 365Times Venture

31
Monday
August, 2026

A News 365Times Venture

Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..

Date:

Pak Spy Network Busted: పాకిస్తాన్ గూఢచారం సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కుట్ర బయటపడింది. పాకిస్తాన్ తరుఫున గూఢచర్యం చేస్తున్న 22 ఏళ్ల దుకాణదారుడిని పంజాబ్‌లో అరెస్ట్ చేశారు. లూథియానా మార్కెట్‌లో నిందితుడు ఒక షూ దుకాణాన్ని నడిపేవాడు. పోలీసులు కథనం ప్రకారం.. అతను లూథియానా నగరం సమాచారాన్ని పాకిస్తాన్‌కు పంపేవాడని తేలింది. దుకాణం బయట అమర్చిన మేడ్ ఇన్ చైనా సీసీటీవీ కెమెరాలతో పాకిస్తాన్‌కు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నట్లు వెల్లడైంది. ఒక సమాచారం మేరకు నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.

లూథియానాలో ఒక భారీ దాడి జరిపేందుకు పాకిస్తానీ ఏజెన్సీలు పన్నిన కుట్రలో భాగంగా ఈ గూఢచర్యం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. సైనిక కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను కూడా ఈ నెట్వర్క్ పాకిస్తాన్‌కు చేరవేస్తున్నట్లు తేలింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏఐజీ సిమ్రత్ పాల్ సింగ్ ధిండ్సా ప్రకారం, విచారణ సమయంలో నిందితుడు పాకిస్థాన్‌లోని తన హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు లుధియానా-ఫిరోజ్‌పూర్ రోడ్డుపై ఒక దుకాణాన్ని అద్దెకు తీసుకున్నట్లు వెల్లడించాడు. ఆ దుకాణం బధోవాల్ ఆయుధ డిపోకు సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అతను నెలకు 40,000 రూపాయలు అద్దెగా చెల్లిస్తున్నాడు.

నిందితుడు దుకాణం బయట, రోడ్డు వైపు చూసే విధంగా చైనాలో తయారైన రెండు సీసీటీవీ కెమెరాలను అమర్చాడు. పాకిస్తాన్ నుంచి అతడి హ్యాండర్లు ఏం జరుగుతుందనే వివరాలను గమనించేవారు. ఈ పని చేస్తున్నందుకు నిందితుడికి పాక్ హ్యాండర్లు సుమారు 3 లక్షల రూపాయలు ఇచ్చినట్లు తెలిసింది. దుకాణం పెద్దగా నడవకున్నా అద్దె చెల్లిస్తూ, సీసీటీవీ కెమెరాల దిశను తరుచుగా మార్చడాన్ని చూసి ఇతడిని అనుమానించారు. ఆగస్టు 27న అందిన సమాచారం ఆధారంగా, లుధియానా కమిషనరేట్ పోలీసులు మరియు లుధియానా కౌంటర్ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా చర్య తీసుకుని రచ్పాల్ సింగ్‌ను అరెస్టు చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..

Reservation row: రిజర్వేషన్ వివాదం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో మంత్రుల...

Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ

ప్రధాని మోడీ ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం...

Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్‌ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..

ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా యూట్యూబ్ ఛానెల్‌లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో...