25
October, 2026

A News 365Times Venture

25
Sunday
October, 2026

A News 365Times Venture

OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?

Date:

OTR: తెలంగాణ మంత్రులు ముగ్గురు ప్లాన్‌ బీ కోసం ఆలోచిస్తున్నారా? సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టాలనుకుంటున్నారా? వారసుల్ని మెయిన్‌ స్ట్రీమ్‌లోకి దింపి తమ రోల్‌ మార్చుకోవాలనుకుంటున్నారా? ఎవరా ముగ్గురు మినిస్టర్స్‌? వాళ్ళ ప్లాన్స్‌ గురించి జరుగుతున్న చర్చలేంటి? రాజకీయాల్లో ఎంత ఎదిగినా.. ఎంతకాలం అధికారంలో ఉన్నా… ఏదో ఒక దశలో వారసత్వం గురించి ఆలోచించడం కామన్‌. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో ముగ్గురు సీనియర్ మంత్రులకు సంబంధించి అలాంటి ఆసక్తికరమైన చర్చే జరుగుతోంది. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. వచ్చే ఎన్నికల నాటికి తమ పొలిటికల్ రూట్ మార్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారట! సుదీర్ఘ రాజకీయ అనుభవం, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ నాయకులు ఇప్పుడు వారసుల గురించి ఆలోచించడంతో పాటు తమ సెకండ్‌ ఇన్నింగ్స్‌కు ప్లాన్‌ చేస్తున్నారన్న ప్రచారం ఆసక్తి రేపుతోంది.

తాము ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి పక్కకు జరిగి, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో ఈ ముగ్గురి విషయంలో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు తమ కుటుంబ సభ్యులను ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట ముగ్గురు. దీనికి సంబంధించి ముగ్గురి నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ…అంతర్గతంగా ప్రయత్నాలు మొదలైనట్టు చెప్పుకుంటున్నారు. ముందుగా తుమ్మల నాగేశ్వరరావు విషయానికి వస్తే… తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరు ఆయన. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు, కేసీఆర్, రేవంత్‌రెడ్డి ప్రభుత్వాల వరకు వివిధ రాజకీయ దశలను చూసిన అనుభవం తుమ్మలది. ఇప్పుడాయన తన కుమారుడు యుగంధర్‌ను వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పూర్తిస్థాయిలో సిద్ధం చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం బరిలో ఈసారి యుగంధర్‌ను దింపాలనుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఇందులో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆమోదం, స్థానిక రాజకీయ సమీకరణాలు కీలకం. వాటి సంగతి ఎలా ఉన్నా… మంత్రి మాత్రం ఈసారి కొడుక్కి ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇప్పించుకుని తాను జాతీయ స్థాయిలో పార్టీకి సేవలందించే అవకాశం వస్తే ఉపయోగించుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

ఇక మరో సీనియర్ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేత. కొల్లాపూర్ నియోజకవర్గంపై ప్రత్యేక రాజకీయ పట్టు సాధించుకున్నారాయన. ఇప్పుడు జూపల్లి కూడా తన రాజకీయ వారసత్వాన్ని కుమారుడికి అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి అరుణ్‌ని రంగంలోకి దింపాలని భావిస్తున్నారట జూపల్లి. తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండి…. కొడుకు విజయానికి రాజకీయ మార్గదర్శకత్వం వహించాలనుకుంటున్నట్టు సమాచారం. అదే సమయంలో ఆయన కూడా… జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ తరఫున కీలక బాధ్యతలు చేపట్టేందుకు ప్రయత్నించవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మూడో మంత్రి దామోదర రాజనర్సింహ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది. కాంగ్రెస్‌లో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న నేత. ప్రస్తుతం అందోల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనూ, కాంగ్రెస్ అధిష్ఠానం స్థాయిలోనూ పరిచయాలు ఉన్న సీనియర్ నాయకుడిగా గుర్తింపు ఉంది. ఇప్పుడు దామోదర రాజనర్సింహ కూడా తన రాజకీయ వారసత్వాన్ని కుమార్తె త్రిషకు అప్పగించాలని భావిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో అందోల్ నుంచి ఆమెను బరిలోకి దించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తనకున్న రాజకీయ అనుభవంతో త్రిషను ముందుకు నడిపిస్తూ తాను జాతీయ రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలనుకుంటున్నారని చెబుతున్నారు.

అయితే… ఈ ముగ్గురి మధ్య ఒక ఆసక్తికరమైన సారూప్యత కనిపిస్తోంది. వేర్వేరు జిల్లాలు, వేర్వేరు రాజకీయ నేపథ్యాలు, వేర్వేరు సామాజిక సమీకరణాలున్న ఈ ముగ్గురు సీనియర్ మంత్రుల…ఎట్టి పరిస్థితుల్లో ఈసారి వారసుల్ని ప్రత్యక్ష ఎన్నికల బరిలో దింపాలని సీరియస్‌గా ఉన్నారట. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే వారసులకు లైన్‌ క్లియర్‌ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో రాజకీయ పట్టు, స్థానిక నాయకులతో సమన్వయం, కార్యకర్తల మద్దతు, ప్రజల్లో గుర్తింపులాంటివన్నీ ముఖ్యమే కాబట్టి… ఆ దిశగా జూనియర్స్‌కు గైడెన్స్‌ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ముగ్గురి ఢిల్లీ ప్లాన్‌పైనా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగిన నాయకులు జాతీయ రాజకీయాల వైపు వెళ్లాలనుకోవడం సహజమేగానీ…. ఢిల్లీ రాజకీయాల్లో అవకాశాలు రావాలంటే కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం కీలకం. దాంతో… పార్టీ జాతీయ సంస్థాగత వ్యవహారాల్లో బాధ్యతలు దక్కుతాయా? లేక భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలను పరిశీలిస్తారా? ఈ రెండూ కాకుండా ఇతర జాతీయ స్థాయి పదవుల వైపు మొగ్గుతారా అన్నది తేలాల్సి ఉంది. మొత్తానికి ఈ ముగ్గురు మంత్రుల విషయంలో వినిపిస్తున్న చర్చ చూస్తుంటే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవడం కన్నా తమ పాత్రను మార్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే రాజకీయాల్లో ఆలోచనలు వేరు నిర్ణయాలు వేరు. అమలు మరింత వేరుగా ఉంటుంది. ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయి? కాంగ్రెస్ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? వారసులకు స్థానికంగా ఎంత మద్దతు లభిస్తుంది? అన్నదానిపైనే ఈ మొత్తం వ్యవహారం ఆధారపడి ఉంటుంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..

Jammu Kashmir: నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి...

Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!

Pakistan LPG Crisis: దాయాది దేశం పాకిస్తాన్ మరో సంక్షోభంతో సతమతం...

Neha Bora: నేహా బోరాకు ఢిల్లీ పోలీస్ నోటీసులు.. అక్టోబర్ 29 వరకే గడువు.!

Neha Bora: ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) అధ్యక్షురాలు నేహా...

OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం

OTR: అక్కడ జడ్పీ పీఠం టీడీపీ, జనసేన మధ్య నీకా నాకా...