17
September, 2026

A News 365Times Venture

17
Thursday
September, 2026

A News 365Times Venture

OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?

Date:

వదిలేదే లే… తగ్గేదే లే….. అంటూ మాజీ మంత్రి చిన్నారెడ్డి ఎవర్ని ఉద్దేశించి అంటున్నారు? కాంగ్రెస్‌ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నాక కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉన్న చిన్నన్నతాజాగా సీక్రెట్‌ మీటింగ్ ఎందుకు పెట్టారు? ఆ సమావేశంలో ఏమేం మాట్లాడుకున్నారు? పదవి పోగొట్టుకున్న పెద్దాయన అడుగులు ఎటువైపు పడబోతున్నాయి? అసలా లెక్కలేంటి?

వనపర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే మేఘారెడ్డితో పాటు, కాంగ్రెస్‌ పెద్దలపై కూడా హాటు ఘాటు వ్యాఖ్యలు చేసి…క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఇటీవల పదవి పోగొట్టుకున్నారు సీనియర్‌ లీడర్‌ చిన్నారెడ్డి. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. క్రమశిక్షణా సంఘం కూడా గతంలో కంటే వేగంగా స్పందించి నిర్ణయం తీసుకోవడంతో….. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, పార్టీకి వీర విధేయుడినని చెప్పుకునే చిన్నారెడ్డి పోస్ట్ ఊస్ట్ అయింది. అయితే చర్యల వేళ సైలెంట్‌గా తన వ్యవసాయ క్షేత్రానికి పరిమితమైన చిన్నారెడ్డి… పెద్ద ప్లాన్‌తోనే ఉన్నారన్నది లేటెస్ట్‌ టాక్‌.

అందులో భాగంగా…. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న కొందరితో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆ మీటింగ్‌కు పలువురు కాంగ్రెస్‌ అసంతృప్త వాదులతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, సైతం హాజరైనట్టు చెప్పుకుంటున్నారు. సమావేశ ఎజెండా, నిర్ణయాలతో గురించి మాట్లాడుకోవడంతోపాటు…రాష్ట్ర పార్టీ నేతలు తన విషయంలో వ్యవహరించిన తీరును ఢిల్లీ పెద్దలకు వివరించాలని నిర్ణయించినట్టు సమాచారం. తగ్గేదే లే, వదిలేదే లే అంటూ సీక్రెట్ మీటింగ్‌లో చిన్నారెడ్డి తన మనుషులతో అన్నట్టు తెలిసింది.

ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను కాదని , మేఘారెడ్డికి కాంగ్రెస్‌ టికెట్ ఇచ్చినప్పటి నుంచి ఆయన గులాబీ పెద్దలతో టచ్‌లో ఉన్నారని, అందుకే సొంత పార్టీ అభ్యర్ది గెలుపుకోసం కాకుండా బీఆర్ఎస్ అభ్యర్ది గెలుపునకు పని చేశారంటూ మరోసారి ఆ ఆంశాన్ని తెరపైకి తెస్తోంది ఎమ్మెల్యే శిబిరం. వనపర్తి ప్రాంతంలో చిన్నారెడ్డి తో కలిసి నడిచే కాంగ్రెస్ వారెవరూ లేరని, రహస్య మీటింగ్స్‌తో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నంలో ఉన్నారని అంటోంది మేఘారెడ్డి వర్గం. చిన్నారెడ్డి బీఆర్ఎస్‌తో టచ్ లో ఉన్నారు కాబట్టే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు రహస్య సమావేశానికి హాజరై ఉండొచ్చంటూ ఎండగడుతోంది ప్రత్యర్థి వర్గం.

కారు పార్టీ డైరెక్షన్‌లోనే చిన్నారెడ్డి అడుగులు వేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అదే సమయంలో… ఇన్నాళ్ళు సైలెంట్‌గా ఉన్న చిన్నారెడ్డి.. ఇప్పుడు సీక్రెట్‌ మీటింగ్‌ పెట్టడం వెనకున్న లెక్కలేంటంటూ ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నాయట. ఇక ఆయన అడుగులు తెలంగాణ భవన్‌ వైపేనని కొందరు విశ్లేషిస్తుండగా… అసెంబ్లీ ఎన్నికల నుంచే ఆ పార్టీతో అంటకాగుతున్నారంటూ ఎండగడుతోంది వైరి వర్గం. దీంతో చిన్నారెడ్డి నిర్ణయం ఎలా ఉండబోతోందన్న ఆసక్తి పెరుగుతోంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

PM Modi: ప్రధాని మోడీ స్నేహితుడికి ఊరట.. స్థలాన్ని వదులకున్న బీజేపీ ఎమ్మెల్యే..

PM Modi: ఇటీవల ప్రధాని నరేంద్రమోడీని ఆయన చిన్ననాటి మిత్రుడు అస్గర్...

UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..

UPI Charges: UPI చెల్లింపుల ఛార్జీల అంశం సుప్రీంకోర్టుకు చేరింది. రూ....

Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు

అడ్వాన్స్ టిప్ విధానాన్ని నిలిపివేయాలని క్యాబ్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు...

Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్

బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్‌కు బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనాలని భారతదేశం రెండు...