30
October, 2026

A News 365Times Venture

30
Friday
October, 2026

A News 365Times Venture

Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!

Date:

Off The Record: వైసీపీ కంచుకోటగా చెప్పుకునే కడప జిల్లాలో ఆ పార్టీని టార్గెట్ చేసి పైచేయి సాధించడానికి కూటమి పార్టీలు గట్టిగానే ప్లాన్‌ చేశాయి. ఎక్కడికక్కడ, ఏ పార్టీకి ఆ పార్టీ ప్రత్యేక వ్యూహాలతో ఆ లైన్‌లోకి వచ్చాయి. కడప జిల్లాలో మొత్తం 39 జడ్పీటీసీలు ఉండగా అందులో 23 సీట్లను ఇప్పటికే ఏకగ్రీవం చేసుకుంది కూటమి. ఇక మిగిలిన 16 జడ్పీటీసీల ఎన్నిక నామ మాత్రమేనని అంటున్నారు. ఇక్కడ జడ్పీ చైర్మన్ పదవి దక్కాలంటే 20 మంది జడ్పీటీసీల బలం సరిపోతుంది. ఆ ప్రకారం చూస్తే… పోస్ట్‌ కూటమి ఖాతాలో పడిపోయినట్టే. కానీ… అసలు ట్విస్ట్‌ అక్కడే మొదలైంది. కూటమి నాయకుల అంతర్గత కుమ్ములాటలతో… జిల్లా పరిషత్‌ పీఠం మీద ఎవరు కూర్చుంటాన్నది సస్పెన్స్‌ అయింది. మాకంటే మాకే కావాలంటూ టీడీపీ, బీజేపీ నాయకులు పోటీ పడుతుంటడంతో వ్యవహారం రసకందాయంలో పడింది. జడ్పీటీసీలను ఎలా ఏకగ్రీవం చేసుకోవాలి, ప్రత్యర్థుల్ని ఎలా అడ్డుకోవాలంటూ నిన్న మొన్నటి వరకు కలిసి ఎత్తుగడలు వేసిన నేతలు… ఇప్పుడు ఏ రూట్లో వెళితే మనకు ఛైర్మన్ పీఠం దక్కుతుందా అంటూ పావులు కదుపుతుండటం ఆసక్తి రేపుతోంది.

కడప జిల్లాలో కూటమి ఏకగ్రీవాల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిన నాయకుల్లో ముఖ్యుడు కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి. అందుకే.. తన తండ్రి పుత్తా నరసింహారెడ్డిని ఛైర్మన్‌ని చేయాలన్నది ఆయన డిమాండ్‌. ఇక బీజేపీ తరఫున జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తనదైన శైలిలో ఏకగ్రీవాల కోసం కృషి చేశారు. ఆయన కూడా… తన సోదరుడి కుమారుడు డాక్టర్ చదిపిరాళ్ళ రాజేష్ రెడ్డిని ఛైర్మన్‌ని చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. దీంతో… కడప కూటమి రాజకీయం రక్తి కడుతోంది. పుత్తా నరసింహారెడ్డి టిడిపి సీనియర్ లీడర్‌. ఎలాగైనా ఈసారి జెడ్పీ చైర్మన్ పదవి దక్కించుకుని జిల్లా వ్యాప్తంగా పెత్తనం చెలాయించాలని భిస్తున్నారట ఆయన. అందుకే రెండు చోట్ల నామినేషన్ వేశారు. చివరికి వీరపునాయన పల్లె జడ్పిటిసిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారాయన. అలాగే…. వరదరాజులురెడ్డి లాంటి జిల్లా టీడీపీ సీనియర్స్‌ అందరితో అంతర్గత సమావేశాలు పెట్టుకుని వాళ్ళ పరిధిలోని జడ్పీటీసీల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారట. అదే సమయంలో కూటమిలో మేం కూడా భాగస్వామ్యమే కదా…. ఈసారి జడ్పీ సీటు కచ్చితంగా మాకే కావాలని అడుగుతున్నారట జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి.
సోదరుడి కొడుకు రాజేష్‌ రెడ్డి కోసం ఆదినారాయణరెడ్డి వ్యూహాలు రూపొందించడం పొలిటికల్ కాక రేపుతోంది. నామినేషన్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించిన ఆదినారాయణ రెడ్డి… కడప జిల్లా పరిషత్ కేంద్రం వద్ద జడ్పీటీసీ అభ్యర్థులతో స్వయంగా మాట్లాడినట్టు సమాచారం.

అంతే కాకుండా.. నామినేషన్ల స్క్రూటినీ అయిపోయే వరకు దగ్గరుండి పరిశీలించారాయన. ఈసారి తన సోదరుడి కుమారుడు జడ్పీ చైర్మన్ కాబోతున్నారంటూ ప్రెస్‌మీట్‌లో ఓపెన్‌ కామెంట్స్‌ చేశారు జమ్మలమడుగు ఎమ్మెల్యే. ఈ పరిస్థితుల్లో… ఫైనల్‌గా ఛైర్మన్‌ పదవి ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ముందు జరిగిన ఏకగ్రీవాలను చూసి… కడప జడ్పీ ఛైర్మన్‌ పదవి ఇక పెద్ద మేటర్‌ కాదని అనుకుంటున్న సమయంలో రెండు పార్టీలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పోటాపోటీగా పావులు కదపడం, తమ కుటుంబ సభ్యులకే ఇవ్వాలని పట్టుబట్టడం ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. ఎవరి అధిష్టానాల ద్వారా వారు వత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తుండటంతో… కడప కూటమిలో ఏం జరగబోతోందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Ilhan Omar: సోదరుడితో పెళ్లి ఆరోపణలు.. అమెరికా ఎంపీ ఇల్హాన్ ఒమర్‌పై విచారణ!

Ilhan Omar: అమెరికా డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎంపీ ఇల్హాన్ ఒమర్...

CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది

ఢిల్లీలో నిర్వహించిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో...

World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!

ప్రతి నెల జీతం వస్తుంది.. ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, సరుకులు,...

UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..

UP News: ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లి ఏర్పాట్లు...