9
October, 2026

A News 365Times Venture

9
Friday
October, 2026

A News 365Times Venture

Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్‌

Date:

2026 సంవత్సరానికి గానూ సాహిత్యంలో నోబెల్ బహుమతి కెనడాకు చెందిన రచయిత్రి అన్నే కార్సన్‌ను వరించింది. సంప్రదాయ సాహిత్యంతో సృజనాత్మకంగా సంభాషిస్తూ.. సమకాలీన సాహిత్యానికి సరికొత్త రూపాలను అందించిన ఆమె వినూత్న రచనలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రకటించారు. ధైర్యవంతమైన, ప్రయోగాత్మకమైన రచనలతో సాహిత్య రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందినట్లు నోబెల్ కమిటీ ప్రశంసించింది.

టొరంటోలో జననం

అన్నే కార్సన్ 1950లో కెనడాలోని టొరంటోలో జన్మించారు. ప్రాచీన గ్రీకు, రోమన్ సాహిత్యంపై అధ్యయనంతో పాటు కవిత్వం, అనువాద రంగాల్లోనూ ఆమె విశేష కృషి చేశారు. 1981లో ‘Odi et Amo Ergo Sum’ పేరుతో ప్రాచీన సాహిత్య అధ్యయనానికి సంబంధించిన తన డాక్టరల్ థీసిస్‌ను ప్రచురించారు. తన సుదీర్ఘ సాహిత్య ప్రయాణంలో కవిత్వ రచన, అనువాదం, విశ్వవిద్యాలయాల్లో బోధనను సమాంతరంగా కొనసాగించారు. భాషపై లోతైన అధ్యయనం, పదాల అర్థాలపై ఆసక్తి, కొత్త భావాలను వ్యక్తీకరించాలనే కవయిత్రి తపన ఆమె రచనల్లో స్పష్టంగా కనిపిస్తాయి. అన్నే కార్సన్ రచనల్లో పదాల వ్యుత్పత్తి, వాటి చారిత్రక నేపథ్యం కీలక పాత్ర పోషిస్తాయి. పదాల మూలాలను పరిశీలించడం తన రచనా ప్రక్రియకు ప్రారంభ బిందువుగా ఉంటుందని ఆమె స్వయంగా పేర్కొన్నారు. ప్రాచీన సాహిత్య సంప్రదాయాలను ఆధునిక భావాలతో మేళవిస్తూ కవిత్వం, అనువాదం వంటి ప్రక్రియల ద్వారా కొత్త సాహిత్య రూపాలను అన్వేషించడం ఆమె ప్రత్యేకత. ఈ వినూత్న శైలే అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది.

సంప్రదాయ సాహిత్యాన్ని యథాతథంగా అనుసరించకుండా, దానితో సృజనాత్మక సంభాషణ సాగిస్తూ కొత్త వ్యక్తీకరణ మార్గాలను సృష్టించారని నోబెల్ కమిటీ పేర్కొంది. ఆమె రచనలు ప్రాచీన సాహిత్య వారసత్వాన్ని ఆధునిక సాహిత్య ప్రయోగాలతో అనుసంధానిస్తూ పాఠకులకు భిన్నమైన అనుభూతిని అందిస్తాయి. ఈ పురస్కారంతో ప్రపంచ సాహిత్యంలో అన్నే కార్సన్ కృషికి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!

Elon Musk: ప్రపంచ కుబేరుడు భారత్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు....

Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన

సౌదీపై హౌతీల దాడులు తీవ్రమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది....

US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!

అమెరికాలోని ప్రముఖ ఐటీ కంపెనీలకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది....

OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?

OTR: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు బీఆర్‌ఎస్‌...