12
September, 2026

A News 365Times Venture

12
Saturday
September, 2026

A News 365Times Venture

New Smart Mobile: OLED డిస్‌ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్‌ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..

Date:

హువావే (Huawei) స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒక సరికొత్త, వినూత్నమైన డిజైన్‌తో కూడిన Huawei Pura X View ఫోన్‌ను తీసుకొచ్చింది. పాస్‌పోర్ట్ లాంటి విభిన్నమైన ఆకారంతో, ప్రపంచంలోనే మొట్టమొదటి వైడ్-స్క్రీన్ నాన్-ఫోల్డబుల్ ఫోన్‌గా వస్తున్న ఈ డివైజ్ లాంచ్ అయిన వెంటనే ట్రెండింగ్‌లోకి వచ్చింది. సెప్టెంబర్ 7న చైనాలో విడుదలైన ఈ ఫోన్‌పై కస్టమర్ల నుంచి ఊహించని స్పందన లభించింది. ఏకంగా తొలి రోజే 1,80,000కి పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. స్టూడెంట్స్ కోసం ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉంచడంతో అమ్మకాలు మరింత జోరుగా సాగాయి. ఈ ఫోన్ 12GB RAM, 256GB, 512GB, 1TB స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల పరంగా చాలా శక్తివంతమైనది. ఇందులో కిరిన్ 9030S ప్రాసెసర్, ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు 6,400mm² పెద్ద వేపర్ కూలింగ్ ఛాంబర్ అమర్చారు. ముందు భాగంలో 6.39 అంగుళాల ఫ్లాట్ OLED డిస్‌ప్లే ఉంది, ఇది 16:9.5 ఆస్పెక్ట్ రేషియో, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 6500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కున్లూన్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. కెమెరా విభాగంలో, వెనుక వైపు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది; ఇందులో 200 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ (OIS సపోర్ట్‌తో), 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలీఫోటో, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్, రెడ్ మేపుల్ కలర్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 40 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, ఛార్జింగ్ పరంగా కూడా ఇది అద్భుతంగా ఉంది. ఇందులో 7,000mAh శక్తివంతమైన సిలికాన్-నోడ్ బ్యాటరీ ఉంది, ఇది 66W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, ఫోన్ మందం కేవలం 6.68 mm, బరువు సుమారు 201 గ్రాములు మాత్రమే. ఇది హార్మొనీ OS 7 పై పనిచేస్తుంది. అంతేకాకుండా, IP68, IP69 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, టూ-వే బెయిడౌ శాటిలైట్ మెసేజింగ్, ఈ-సిమ్ (eSIM) సపోర్ట్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీనిని షాడో రెడ్, లినెన్ గ్రే, జీరో వైట్, మిడ్‌నైట్ బ్లాక్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Gulf-Iran: హార్ముజ్‌పై గల్ఫ్ దేశాలు కీలక నిర్ణయం.. ఇరాన్‌కు సందేశం

హార్ముజ్ విషయంలో గల్ఫ్ దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హార్ముజ్...

Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!

Pakistan: ఢిల్లీ వేదికగా బ్రిక్స్(BRICS) శిఖరాగ్ర సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు...

LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?

LG స్మార్ట్‌ఫోన్‌లు, టీవీల వినియోగం పెరుగుతున్న తరుణంలో, ఎల్‌జి (LG) స్మార్ట్...

Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా మరింత బలపడుతోంది. ఇది...