19
June, 2026

A News 365Times Venture

19
Friday
June, 2026

A News 365Times Venture

Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

Date:

ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్ర శక్తిగా మారదని వ్యాఖ్యానించారు. తన పాలనలో ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో తాను, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పూర్తిగా ఏకీభవిస్తున్నామని తెలిపారు.

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ అణ్వస్త్ర శక్తిగా మారకుండా నిరోధించే విషయంలో తాను, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి ఏకాభిప్రాయంతో ఉన్నామని పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాలుగా తాను ఇరాన్‌పై అంతర్జాతీయ యుద్ధం చేయకపోయి ఉంటే.. ఇజ్రాయెల్‌ను నాశనం చేయగల అణుబాంబును ఇరాన్ ఎప్పుడో అభివృద్ధి చేసి ఉండేదని చెప్పుకొచ్చారు. తాను ప్రధానమంత్రిగా కొనసాగినంత కాలం.. ఇరాన్‌ను అణ్వాయుధాలు సంపాదించుకోనివ్వనని నెతన్యాహు స్పష్టం చేశారు.

ఇరాన్ అణ్వాయుధాలను నిర్మించలేకపోతుంది.
‘‘నేను 30 ఏళ్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ అణు కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాను. నేను ఈ పోరాటం చేయకపోయి ఉంటే.. ఇజ్రాయెల్‌ను నాశనం చేయడానికి ఇరాన్ ఎప్పుడో ఒక అణు బాంబును అభివృద్ధి చేసి ఉండేది. ఇరాన్ మన దేశాన్ని నాశనం చేయాలని చూస్తోంది. వారిని ఆపడానికి నేను చేయగలిగినదంతా చేస్తున్నాను. నేను ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం.. ఇరాన్ కల ఎప్పటికీ నెరవేరదు.’’ అని నెతన్యాహు అన్నారు.

ఇరాన్ అణు కార్యక్రమాన్ని అమెరికా-ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తున్నాయి. ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధానికి అణు కార్యక్రమమే ప్రధాన కారణం. ఇరాన్ ఏళ్లుగా తన అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తుండగా.. అమెరికా దానిని నిరంతరం వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇరాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అణుశక్తిగా ఎదగనివ్వనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు. ఇటీవల.. ఇరాన్‌తో సంఘర్షణ ముగింపు దశకు చేరుకుందని.. టెహ్రాన్ అణు ఆశయాలను ఏదో ఒక విధంగా అడ్డుకుంటామని ప్రకటించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Meloni-Trump: ఇటలీ ఎప్పుడూ అలా చేయదు.. ట్రంప్‌పై మెలోని తీవ్ర ఆగ్రహం

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిపై అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా...

AP Women’s Commission Notice: గుడివాడ అమర్‌నాథ్‌కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..

AP Women’s Commission Notice: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత,...

Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!

తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజమండ్రి రోడ్ కమ్ రైల్...