28
August, 2026

A News 365Times Venture

28
Friday
August, 2026

A News 365Times Venture

Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?

Date:

Nepal Floods: నేపాల్‌లో ఆకస్మిక వరదలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్న వేళ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వేగంగా ప్రవహిస్తున్న వరద నీటిలో ప్రజలు సిలిండర్ల కోసం వెతుకుతూ, వాటిని బయటకు తీసేందుకు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. కొందరు ఏకంగా రెండు సిలిండర్లను భుజాలపై మోసుకెళ్తుండగా, మరికొందరు వాటి కోసం గొడవపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

వరద నీటిలో సిలిండర్ల కోసం వెతుకులాట
ఒక వీడియోలో ఓ వ్యక్తి వరద నీటిలో నుంచి రెండు గ్యాస్ సిలిండర్లను భుజాలపై మోసుకెళ్తున్నట్లు కనిపించింది. మరో వీడియోలో ఓ కుటుంబం మురుగునీటిలో ఈదుతూ సిలిండర్ కోసం వెతుకుతున్న దృశ్యాలు కనిపించాయి. వేగంగా ప్రవహిస్తున్న నీటిలో సిలిండర్లను బయటకు తీసేందుకు ప్రయత్నించడం ప్రమాదకరమని పలువురు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు మరిన్ని వైరల్ అవుతుండటంతో నేపాల్ పోలీసులు కూడా ప్రజలను హెచ్చరించారు. వరద నీటిలో కొట్టుకుపోతున్న సిలిండర్లు, ఇతర బరువైన వస్తువులను తీసుకునేందుకు ప్రయత్నించి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని సూచించారు.

అసలు కారణం.. నెలల తరబడి కొనసాగుతున్న గ్యాస్ కొరత
ప్రజలు సిలిండర్ల కోసం ఇంతటి ప్రమాదాన్ని ఎందుకు ఎదుర్కొంటున్నారనే ప్రశ్నకు నేపాల్‌లో కొనసాగుతున్న ఎల్పీజీ గ్యాస్ కొరత ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దేశం చాలా కాలంగా ఎల్పీజీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నేపాలీ క్యాలెండర్ ప్రకారం ఫాల్గుణ్ 2082 అంటే మార్చి-ఏప్రిల్ 2026 నుంచి ఈ కొరత కొనసాగుతున్నట్లు స్థానిక నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం సంక్షోభాన్ని తగ్గించేందుకు పలు చర్యలు చేపట్టినా పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు. కొంతకాలం పాటు ప్రజలకు 7.1 కిలోల గ్యాస్ మాత్రమే ఉండే చిన్న సిలిండర్లను అందించే విధానాన్ని కూడా ప్రభుత్వం అమలు చేసింది.

గంటల తరబడి క్యూలలో నిలుస్తున్న ప్రజలు
గ్యాస్ కొరత కారణంగా నేపాల్ రాజధాని కాఠ్మండుతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ ప్రజల రోజువారీ జీవితం తీవ్రంగా ప్రభావితమైంది. ఒక సిలిండర్ కోసం వినియోగదారులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆగస్టు 16న కాఠ్మండు పోస్ట్ నివేదిక ప్రకారం, నేపాల్ విద్యార్థి సంఘం నాయకులు ఖాళీ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు గ్యాస్ కోసం క్యూలలో ఎందుకు నిలబడాల్సి వస్తోందని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఐదు ప్రాంతాల్లో ప్రభుత్వం విక్రయాలు
ఆగస్టు 15న రాయిటర్స్ నివేదిక ప్రకారం, కాఠ్మండులోని ఐదు ప్రాంతాల్లో ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్లను విక్రయిస్తోంది. అత్యవసర అవసరాలు ఉన్న వినియోగదారులు పౌరసత్వ ధ్రువీకరణ పత్రం లేదా జాతీయ గుర్తింపు కార్డును చూపించి గ్యాస్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో వరదల సమయంలో నీటిలో కొట్టుకుపోతున్న సిలిండర్ సాధారణ వస్తువుగా కాకుండా అత్యంత విలువైన, కొరతలో ఉన్న వనరుగా మారింది. అయితే, ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి వాటిని రక్షించడం మాత్రం అత్యంత ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ న్యూయార్క్ పర్యటన వేళ కీలక పరిణామం...

Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!

Mithali Raj: భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్...

Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ

ఊహించని రీతిగా జలప్రళయం వచ్చి ఎందరో సర్వం కోల్పోయారు. వందలాది మంది...

Nepal Floods: నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!

నేపాల్‌లో మెరుపు వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికుల క్షేమ సమాచారంపై...