4
November, 2026

A News 365Times Venture

4
Wednesday
November, 2026

A News 365Times Venture

NASA: భూమి వైపు దూసుకువస్తోన్న నాసా టెలిస్కోప్.. క్రాష్ జోన్‌లో హైదరాబాద్, ముంబై..

Date:

NASA: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన ‘నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ’ స్పేస్ టెలిస్కోప్‌ భూమివైపు దూసుకొస్తోంది. సుమారు 1500 కిలోల బరువున్న ఈ అంతరిక్ష టెలిస్కోప్ నవంబర్ 04న భూ వాతావరణంలోకి ప్రవేశించి కూలిపోనుంది. ఇలా కూలేటప్పుడు చాలా భాగాలు భూ వాతవరణంలోని ఘర్షణ కారణంగా కాలిబూడిద అవుతాయి. అయితే, కొన్ని భారమైన శకలాలు మాత్రం భూమిపై పడే అవకాశం ఉంది.

క్రాష్ జోన్‌లో భారత్..

ఇదిలా ఉంటే, ఈ శాటిలైట్ టెలిస్కోప్ కూలిపోయే క్రాష్ జోన్ పరిధిలో భారత్ కూడా ఉంది. ముంబై, హైదరాబాద్, బెంగళూర్, చెన్నై వంటి నగాలు ఈ పరిధిలో ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. నాసా అంచనాల ప్రకారం, నవంబర్ 4న అమెరికా తూర్పు కాలమాన ప్రకారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో(భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు) ఈ టెలిస్కోప్ భూ వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. నాసా మిషన్ చీఫ్ సైంటిస్ట్ బ్రాడ్ సెంకో మాట్లాడుతూ.. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, భారత్‌, ఆగ్నేయాసియా, మధ్య, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు ఈ టెలిస్కోప్ తిరిగి రీఎంట్రీ పరిధిలో ఉన్నాయని తెలిపారు.

ఈ పరిధి దక్షిణ అక్షాంశం 20.6 డిగ్రీల నుంచి ఉత్తర అక్షాంశం 20.6 డిగ్రీల మధ్య విస్తరించి ఉంది. భారత్‌ విషయానికొస్తే.. పశ్చిమ తీరంలోని డామన్‌ నుంచి తూర్పు తీరంలోని ఒడిశా రాష్ట్రం కటక్‌ వరకు దక్షిణంగా ఉన్న ప్రాంతాలు ఈ పరిధిలోకి వస్తాయి. దీంతో ముంబై, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాలు ఈ భౌగోళిక పరిధిలో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, టెలిస్కోప్ మొత్తం బరువు 1500 కిలోలు అయితే, దీంట్లో 100 కిలోల విడిభాగాలు మాత్రమే భూ వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నాయి. చాలా వరకు సముద్రంలోనే పడే ఛాన్స్ ఉంది.

నాసా మిషన్ విఫలం తర్వాత..

2004 నవంబర్ 20న అంతరిక్షంలోకి ప్రయోగించిన ఈ టెలిస్కోప్ .. అనుకున్న దాని కన్నా ఎక్కువ కాలం పనిచేసింది. దాదాపు 22 ఏళ్ల పాటు అంతరిక్ష పరిశోధనలు చేసిన ఈ టెలిస్కోప్, 2000కు పైగా గామా కిరణాల విస్పోటనాలను, 1400 సూపర్ నోవాలను పరిశీలించింది. అయితే, దీర్ఘకాలంగా సేవలందించడంతో దీని కక్ష్య క్రమంగా క్షీణించింది. దీనిని సరైన కక్ష్యలో పెట్టేందుకు నాసా చేపట్టిన మిషన్ కూడా విఫలం కావడంతో, ఇది భూమి పై కూలడం అనివార్యంగా మారింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AP Municipal Election Results: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్..! మున్సిపాలిటీల్లో టీడీపీ హవా

AP Municipal Election Results: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి...

YS Jagan: చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్.. వైఎస్‌ జగన్ సంచలన ట్వీట్

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ప్రక్రియలో...

US Midterm Elections 2026: అమెరికా మిడ్‌టర్మ్‌ ఎన్నికలు.. ట్రంప్‌ పార్టీకి సర్వేలలో ఎదురుగాలి!

US Midterm Elections 2026: అమెరికాలో మిడ్‌టర్మ్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది....

US Strike on Iran: ఇరాన్ వైమానిక రక్షణ కేంద్రం ధ్వంసం.. ట్రంప్ కీలక ప్రకటన!

US Strike on Iran: ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులు జరిపినట్లు...