1
May, 2026

A News 365Times Venture

1
Friday
May, 2026

A News 365Times Venture

Nara Lokesh: స్కూల్ డేస్‌లో నేను లాస్ట్ బెంచ్.. మాది అల్లరి బ్యాచ్!

Date:

స్కూల్ డేస్‌లో తనది లాస్ట్ బెంచ్ అని, తమది అల్లరి బ్యాచ్ అని మంత్రి నారా లోకేష్ చెప్పారు. స్కూల్లో పరీక్షలు రాయడం, అసెంబ్లీలో సమాధానాలు చెప్పడం రెండూ కష్టమైనవే అని పేర్కొన్నారు. ప్రతిపక్షం సభలో లేకపోయినప్పటికీ.. అధికారపక్షం సభ్యులు ప్రతిపక్షం కంటే కష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారని చెప్పారు. తన తండ్రి, సీఎం నారా చంద్రబాబు గారి స్పూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ తనకు ఇష్టమైన కొటేషన్ అని మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో మంత్రి భేటీ అయ్యారు.

‘షైనింగ్ స్టార్స్’ కార్యక్రమంలో పదోతరగతి ఉత్తమ విద్యార్థులకు సత్కార కార్యక్రమం సందర్భంగా మంత్రి నారా లోకేష్, విద్యార్థులకు మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. విద్యార్థులు అడిగిన పలు సరదా ప్రశ్నలకు మంత్రి ఉత్సాహంగా సమాధానాలిచ్చారు. మీకు స్కూలులో పరీక్షలు కష్టంగా ఉండేవా? లేదా అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలు కష్టమా? అని చీరాలకు చెందిన సంతోష్ ప్రశ్నించాడు. అందుకు పరీక్షలు రాయడం, అసెంబ్లీలో సమాధానాలు చెప్పడం రెండూ కష్టమైనవే అని మంత్రి బదులిచ్చారు. ‘అసెంబ్లీ ప్రశ్నలను ఎదుర్కోవడం పూర్తిగా భిన్నమైనది. ప్రతిపక్షం సభలో లేకపోయినప్పటికీ.. అధికారపక్షం సభ్యులు ప్రతిపక్షం కంటే కష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిరోజూ నాకు మూడు ప్రశ్నలు వచ్చాయి. వాటికి సమాధానం చెప్పేందుకు ఎంతో ప్రిపేర్ కావాల్సి వచ్చింది. స్కూల్ డేస్‌లో నేను లాస్ట్ బెంచి, మాది అల్లరి బ్యాచ్’ అని లోకేష్ సరదాగా సమాధానమిచ్చారు.

Also Read: Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు 14 రోజుల రిమాండ్‌!

‘ఏపీలో విద్యా సంస్కరణలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈనాటి షైనింగ్‌ స్టార్లే ఏపీ విద్యా వ్యవస్థకు బ్రాండ్‌ అంబాసిడర్లు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్ల ఉత్తమ విద్యార్థులతో యాడ్స్‌ చేస్తాం. కష్టపడి పనిచేయడంలో సీఎం చంద్రబాబుని స్ఫూర్తిగా తీసుకోవాలి. మంచి మార్కులు సాధించి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లిదండ్రులు తలెత్తుకొని తిరిగేలా చేశారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా.. లక్ష్య సాధన కోసం కసి, పట్టుదలతో ముందుకు సాగాలి. సవాళ్లు ఉన్నప్పటికీ విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్నాం’ అని విద్యార్థులతో మంత్రి నారా లోకేష్ అన్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Bengal Elections: ఎన్నికల కౌంటింగ్‌ ముందు సుప్రీంకోర్టుకు తృణమూల్..

Bengal Elections: దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. మే...

Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని మధ్యతరగతి, పేద ప్రజలకు బయట తినడం అంటేనే...

SRH: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్ (IPL) సందడి నెలకొంది. క్రికెట్ అభిమానులంతా తమ...

KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!

KTR : ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక ఆశలు చూపి, అధికారంలోకి...