6
October, 2026

A News 365Times Venture

6
Tuesday
October, 2026

A News 365Times Venture

Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు

Date:

ముంబైలోని బృహన్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ బస్ డిపోలో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెంట్రల్ ముంబైలోని అనిక్ డిపో యార్డులో ఈ ప్రమాదం జరిగింది. మంటల్లో పలు CNG బస్సులు కాలిపోయాయి. అధికారుల వివరాల ప్రకారం.. సాయంత్రం 5:45 గంటల సమయంలో అనిక్ డిపో యార్డులో మంటలు చెలరేగాయి. ఇప్పటివరకు 10 బస్సులు పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. దగ్ధమైన బస్సులన్నీ ప్రైవేట్ ఆపరేటర్ దాగా గ్రూప్ నుంచి తీసుకున్న వెట్-లీజ్‌డ్ ఎయిర్ కండిషన్డ్ మిడీ CNG బస్సులుగా అధికారులు గుర్తించారు. అగ్నిప్రమాదం సమయంలో భారీగా నల్లటి పొగలు కమ్ముకున్నాయి.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో పేలుడు శబ్దాలు కూడా వినిపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దూరం నుంచే భారీగా నల్లటి పొగలు కనిపించినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో మంటల్లో చిక్కుకున్న బస్సుల నుంచి దట్టమైన నల్లటి పొగలు పైకి ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కనీసం నాలుగు ఫైర్ ఇంజిన్లు, ఐదు వాటర్ ట్యాంకర్లతో పాటు ఇతర అగ్నిమాపక వాహనాలను అక్కడికి తరలించారు. గంటకు పైగా శ్రమించిన అనంతరం మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాల సమాచారం లేదని తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. మంటలు ఎలా చెలరేగాయి, ఆ తర్వాత బస్సులకు ఎలా వ్యాపించాయన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్‌ టిప్స్‌..

Plastic Bucket Cleaning Tips: ఇంట్లో, బాత్‌రూమ్‌లో నిత్యం ఉపయోగించే ప్లాస్టిక్...

Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..

తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు డిస్కంలు షాకిచ్చాయి. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలైన...

Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?

Off The Record: తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల...

GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!

జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశం మరోసారి వాయిదా పడింది. అక్టోబర్ 7న...