9
September, 2026

A News 365Times Venture

9
Wednesday
September, 2026

A News 365Times Venture

Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!

Date:

ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ లండన్‌లోని నివాసం అమ్మకానికి పెట్టారు. ఇది ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి కేవలం 50 మీటర్ల దూరంలోనే ఉండడం విశేషం. లండన్‌లోని అత్యంత సంపన్న ప్రాంతాల్లో ఉన్న విలాసవంతమైన పెంట్‌హౌస్ ఇప్పుడు అమ్మకానికి ఉంచారు. దీని విలువ సుమారుగా రూ.140 కోట్లు (దాదాపు $1.4 బిలియన్లు). అదే భవనంలోని మరో పెంట్‌హౌస్‌ను సుమారుగా £16.75 మిలియన్లగా ఉంది. ఈ రెండింటి కొనుగోలు ధరలను కలిపితే మొత్తం విలువ సుమారుగా £36 మిలియన్లు (దాదాపు $4.5 బిలియన్లు) అవుతుంది. ఈ ఆస్తులకు ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో సంబంధం ఉందని ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ రికార్డుల ప్రకారం యజమాని మాత్రం ఇరాన్ బ్యాంకర్ అలీ అన్సారీగా ఉన్నాడు.

రుణ వాయిదాలు చెల్లించకపోవడమే అమ్మకానికి కారణంగా తెలుస్తోంది. నివేదికల ప్రకారం .. అన్సారీ ఈ ఆస్తులపై ఉన్న వాయిదాలను చెల్లించడంలో విఫలమయ్యాడు. ఫలితంగా రుణదాతలు తమ డబ్బును తిరిగి రాబట్టుకోవడానికి ఆస్తులను అమ్మే ప్రక్రియను ప్రారంభించినట్లు సమాచారం.

ఈ రూ.450 కోట్ల ఆస్తిలో ఏముంది?

ఇవి సాధారణ ఫ్లాట్లు కావు. ఇవి లండన్‌లోని ఒక ఉన్నతమైన ప్రాంతంలో ఉన్న విలాసవంతమైన పెంట్‌హౌస్‌లు. మొదటి పెంట్‌హౌస్ భవనంలోని ఆరవ, ఏడవ అంతస్తులలో విస్తరించి ఉంది. ఇది సుమారు 3,944 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఒక డ్యూప్లెక్స్. ఇందులో ఐదు పడకగదులు, సిబ్బందికి ప్రత్యేక వసతి, ఒక ప్రైవేట్ రూఫ్ టెర్రేస్ ఉన్నాయి. ఈ పెంట్‌హౌస్ ఇప్పుడు సుమారు 12 మిలియన్ పౌండ్లకు అమ్మకానికి ఉంది. ఆసక్తికరంగా అలీ అన్సారీ దీనిని 2016లో సుమారు 19 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేశాడు. అంటే ఇప్పుడు దీని ధర సుమారు 7 మిలియన్ పౌండ్లు తగ్గింది.

అదే భవనంలో రెండవ పెంట్‌హౌస్ కూడా ఉంది. ఇది ఏడవ, ఎనిమిదవ అంతస్తులలో విస్తరించి ఉంది. దీనికి ప్రత్యేక సిబ్బంది స్థలం. ఒక ప్రైవేట్ రూఫ్ టెర్రేస్ కూడా ఉన్నాయి. అన్సారీ దీనిని 2014లో £16.75 మిలియన్లకు కొనుగోలు చేశాడు. అయితే దీనిని ఇంకా బహిరంగంగా అమ్మకానికి పెట్టలేదు. దీంతో దీని ధర ప్రస్తుతం తెలియదు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి 50 మీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్న ఈ ఇళ్ల ధర. వాటి ప్రదేశం వలెనే ధరలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ పెంట్‌హౌస్‌లు కెన్సింగ్‌టన్ ప్యాలెస్ సమీపంలో ఉన్నాయి. కెన్సింగ్‌టన్ గార్డెన్స్‌కు అభిముఖంగా ఉంటాయి. కానీ వాటికి మరో ప్రత్యేక లక్షణం ఉంది.

ఇది ఖమేనీ ఇల్లా లేక అన్సారీ ఆస్తియా?

ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవడం ముఖ్యం. ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. ఈ రెండు పెంట్‌హౌస్‌ల యజమాని అలీ అన్సారీ. అంటే అవి నేరుగా మొజ్తబా ఖమేనీ పేరు మీద లేవు. మరి అలాంటప్పుడు వాటికి ఖమేనీతో సంబంధం ఏమిటి? ఇరాన్ పాలకవర్గంతో సంబంధం ఉన్నట్లు ఆరోపించబడిన ఒక అంతర్జాతీయ ఆస్తి నెట్‌వర్క్‌కు సంబంధించి ఈ దర్యాప్తు జరుగుతోంది. జనవరిలో బ్లూమ్‌బెర్గ్ జరిపిన ఒక దర్యాప్తులో లండన్, ఇతర దేశాల్లో ఖమేనీతో సంబంధం ఉన్నట్లు ఆరోపించబడిన అనేక విలాసవంతమైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆస్తులు అనేక బూటకపు కంపెనీలు. విశ్వసనీయ సహచరులు, మధ్యవర్తుల ద్వారా నియంత్రించబడుతున్నాయని నివేదిక పేర్కొంది. ఈ దర్యాప్తులో బిలియనీర్స్ రోగా ప్రసిద్ధి చెందిన ఉత్తర లండన్‌లోని ది బిషప్స్ అవెన్యూలో ఉన్న 11 విలాసవంతమైన గృహాలు కూడా వెలుగులోకి వచ్చాయి. బ్లూమ్‌బెర్గ్ ప్రాథమిక దర్యాప్తు ఈ రెండు ప్యాలెస్ గ్రీన్ పెంట్‌హౌస్‌ల పేర్లను వెల్లడించనప్పటికీ.. బ్రిటిష్ వార్తాపత్రికలు ప్రకారం.. ఈ అపార్ట్‌మెంట్లను ఖమేనీకి ముడిపెట్టాయి. ఈ విషయం ఇంతటితో ముగియలేదు. జూలైలో అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ అలీ అన్సారీపై ఆంక్షలు విధించింది. అతడిని ఖమేనీకి ప్రధాన ఆర్థిక సహాయకుడిగా పేర్కొంటూ.. ఇరాన్ సర్వోన్నత నాయకుడికి, పాలక వర్గంలోని ఇతర సభ్యులకు ప్రయోజనం చేకూర్చే అంతర్జాతీయ ఆస్తుల నెట్‌వర్క్‌ను అతడు నిర్వహించాడని ఆరోపించింది.

ఇరాన్ ఐఆర్‌జీసీకి ఆర్థిక సహాయం అందిస్తున్నారనే ఆరోపణలపై బ్రిటన్ గతంలో కూడా అన్సారీపై ఆంక్షలు విధించింది. బ్రిటన్‌లోని అతని ఆస్తులను స్తంభింపజేసి.. దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించారు. అయితే అన్సారీ న్యాయవాది ఈ ఆరోపణలను ఖండించారు. ఖమేనీ లేదా ఐఆర్‌జీసీతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని అన్సారీ ఖండించారు. బ్రిటన్ ఆంక్షలను సవాలు చేస్తారని ఆయన అన్నారు. ఇక పత్రాల ప్రకారం యజమాని అలీ అన్సారీ అయినప్పటికీ.. ఈ రెండు ఆస్తులకు మొజ్తబా ఖమేనీతో సంబంధం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు రుణాలు చెల్లించడంలో విఫలమైన తర్వాత కోట్లాది రూపాయల విలువైన ఈ లండన్ ఆస్తులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ

భారత్‌ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ తదుపరి దశకు సిద్ధంగా ఉందని ప్రధాని...

Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!

ఇజ్రాయెల్‌ సెటిల్మెంట్‌ విధానంపై అంతర్జాతీయ విమర్శలు పెరుగుతున్న వేళ.. బ్రిటన్, ఫ్రాన్స్,...