9
September, 2026

A News 365Times Venture

9
Wednesday
September, 2026

A News 365Times Venture

Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..

Date:

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) ఒక అద్భుతమైన అవకాశాన్ని ముందుకు తీసుకొచ్చింది. రాజధాని నిర్మాణంలో స్థానిక యువతను భాగస్వామ్యం చేయడంతో పాటు వారిలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడానికి ఉచిత డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభమయ్యే ఈ శిక్షణ దాదాపు రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఈ అవకాశాన్ని అమరావతి పరిధిలోని 18 నుంచి 45 ఏళ్ల వయస్సు కలిగిన అర్హులైన యువతీ యువకులు ఉపయోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

శిక్షణలో చేరిన అభ్యర్థులకు నాణ్యమైన కోడింగ్, డేటా మేనేజ్‌మెంట్, ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలపై అనుభవజ్ఞులైన నిపుణులతో తగిన మార్గదర్శకత్వం అందించనున్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఈ కోర్సును పూర్తి ఉచితంగా అందించడమే కాకుండా, శిక్షణా కేంద్రానికి వచ్చి వెళ్లేందుకు వీలుగా రవాణా సౌకర్యాన్ని లేదా రవాణా భత్యాన్ని కూడా ఏపీసిఆర్‌డీఏ కల్పిస్తోంది. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి ప్రభుత్వం ఆమోదించిన విలువైన సర్టిఫికెట్‌ను అందజేస్తారు.

ప్రస్తుతం వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు, ఐటీ కంపెనీలలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు విస్తృతమైన డిమాండ్ ఉంది. ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన వారికి స్థానికంగా జరిగే అభివృద్ధి పనుల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో అలాగే వివిధ ప్రైవేటు సంస్థల్లో మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభించేలా ఏపీసిఆర్‌డీఏ తగిన సహాయసహకారాలు అందించనుంది. నిరుద్యోగ యువత తమ ఆర్థిక స్వావలంబన సాధించడానికి , ఆధునిక సాంకేతిక రంగంలో స్థిరపడటానికి ఈ ఉచిత శిక్షణా కార్యక్రమం ఎంతో తోడ్పడుతుందని అధికారులు స్పష్టం చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ

భారత్‌ డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ తదుపరి దశకు సిద్ధంగా ఉందని ప్రధాని...

Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!

ఇజ్రాయెల్‌ సెటిల్మెంట్‌ విధానంపై అంతర్జాతీయ విమర్శలు పెరుగుతున్న వేళ.. బ్రిటన్, ఫ్రాన్స్,...

Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి

దక్షిణ లెబనాన్‌పై మరోసారి బాంబ్ దాడులు దద్దరిల్లాయి. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక...