5
October, 2026

A News 365Times Venture

5
Monday
October, 2026

A News 365Times Venture

Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్‌ ఉద్యోగి మృతి

Date:

Mobile Phone Blast: పిడుగుపాటు కారణంగా అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పుట్లూరు మండలం గాండ్లపాడు గ్రామ శివారులో పిడుగుపాటుకు విద్యుత్ శాఖ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి చరణ్ మృతి చెందాడు. కోమటికుంట్ల సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న చరణ్.. విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామమైన గాండ్లపాడుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది..

వివరాల ప్రకారం.. వర్షం కురుస్తుండటంతో చరణ్ వర్షం నుంచి తప్పించుకునేందుకు ఓ చెట్టు కిందకు వెళ్లాడు. అదే సమయంలో ఒక్కసారిగా చెట్టుపై పిడుగు పడటంతో చరణ్ పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. చరణ్‌తో పాటు సమీప బంధువు దేవనందు కూడా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. పిడుగుపాటు ధాటికి చరణ్ జేబులో ఉన్న మొబైల్ ఫోన్ పేలినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. చరణ్ 2019 నుంచి విద్యుత్ శాఖలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చరణ్ మృతితో గాండ్లపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో మరోసారి వర్షాలు, పిడుగులపై వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. రేపు కృష్ణా, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు వర్షం, పిడుగుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..

ఆనర్ సంస్థ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా ‘ఆనర్ X5ds’ను సౌతాఫ్రికా...

VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..

వీవో సంస్థ తన ఎస్-సిరీస్‌లో భాగంగా ‘వీవో S60t’ (Vivo S60t)...

Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సరికొత్త రోడ్ల నిర్మాణానికి ఏపీసీఆర్డీఏ శ్రీకారం చుట్టింది....

Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సరికొత్త రోడ్ల నిర్మాణానికి ఏపీసీఆర్డీఏ శ్రీకారం చుట్టింది....