25
August, 2026

A News 365Times Venture

25
Tuesday
August, 2026

A News 365Times Venture

MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్

Date:

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఎదురైన ఓటమిని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఓట్లను మళ్లీ లెక్కించాలని హైకోర్టును కోరారు.

కొలత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు విజయం చెల్లదని ప్రకటించాలని స్టాలిన్ తన పిటిషన్‌లో కోరారు. ఓటింగ్ యంత్రాల్లో సాంకేతిక లోపాలు, వీవీప్యాట్ యంత్రాలకు సంబంధించిన అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని ఓట్లను రీకౌంట్ చేయాలని కోరారు. అంతేకాకుండా వీఎస్ బాబు ఎన్నికను రద్దు చేసి.. తనను విజేతగా ప్రకటించాలని స్టాలిన్ అభ్యర్థించారు.

ఇటీవల శనివారం జరిగిన డీఎంకే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో స్టాలిన్ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తిరిగి పుంజుకునే సామర్థ్యం డీఎంకేకు ప్రత్యేకంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లను తిరిగి పార్టీ వైపు ఆకర్షించడంపై దృష్టి పెట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇదే సమయంలో తమిళనాడు సీఎం, టీవీకే అధినేత విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు. డీఎంకే ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు, ప్రాజెక్టుల పేర్లను మార్చడంలోనే విజయ్ బిజీగా ఉన్నారని విమర్శించారు. “ఆయన (విజయ్) శాసనసభను సినిమా సెట్‌గా భావిస్తున్నారు. పంచ్ డైలాగులు చెబుతున్నారు” అంటూ స్టాలిన్ వ్యాఖ్యానించారు. డీఎంకే రాష్ట్ర ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో డీఎంకే సంస్థాగత వ్యవస్థలో మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని స్టాలిన్ నొక్కి చెప్పారు. పార్టీ కార్యకలాపాలపై అంతర్గతంగా సమీక్ష నిర్వహించాలని సూచించారు. పార్టీ పదవుల్లో ఉన్నవారికి వయోపరిమితి, పదవీకాల పరిమితులను తీసుకురావడంతో పాటు.. సభ్యత్వ నమోదు ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చాలని ప్రతిపాదించారు. గతంలోనూ అనేక రాజకీయ ఎదురుదెబ్బలను అధిగమించి డీఎంకే తిరిగి బలపడిందని స్టాలిన్ గుర్తు చేశారు. పార్టీ పునాది కేవలం ఎన్నికల విజయాలు, పరాజయాలపై ఆధారపడలేదని.. దీర్ఘకాలిక సిద్ధాంతాలు, సంస్థాగత బలం డీఎంకేకు ఉన్నాయని పేర్కొన్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జూనియర్ క్రికెట్ వ్యవస్థలో కీలక...

YS Jagan: జూనియర్ డాక్టర్ల సమ్మెపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది.. జూడాలతో ప్రభుత్వం...

Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!

కర్ణాటకలో ఓ న్యాయమూర్తికి షాకింగ్ ఘటన ఎదురైంది. ఆస్పత్రిలోని ఓ గదిలో...

Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి

తమిళనాడు రాజకీయాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో తీవ్ర...