26
September, 2026

A News 365Times Venture

26
Saturday
September, 2026

A News 365Times Venture

Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు

Date:

Minister Satyakumar Yadav: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది.. కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా.. తమకు కేటాయించే స్థానాల్లో గెలుపు గుర్రాల వేటలో పడింది.. ఈ పథ్యంలో మంత్రి సత్యకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో 72 నూతన 104 ఎంఎంయూ (మొబైల్ మెడికల్ యూనిట్) వాహనాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్యాం ప్రసాద్, హెల్త్ కమిషనర్ చక్రధర్ బాబు పాల్గొన్నారు. అనంతరం నూతన వాహనాలతో ధర్మవరం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.

మున్సిపల్ ఎన్నికలపై సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా ధర్మవరం మున్సిపల్ ఎన్నికలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం త్యాగాలు చేసిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారని ఆయన అన్నారు. వారి త్యాగాలను వృథా కానివ్వబోమని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. అయితే, కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై రాష్ట్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని సత్యకుమార్ చెప్పారు. కింది స్థాయిలోనూ మూడు పార్టీల నేతలు కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. బీజేపీ నేతలకు తగిన ప్రాధాన్యం కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు.. గతంలో మాదిరిగా అప్రజాస్వామికంగా ఎన్నికలు జరగవని మంత్రి సత్యకుమార్ అన్నారు. ధర్మవరంలో అభివృద్ధి పనులు చేపట్టామని, ఆ అభివృద్ధిని ప్రజల ముందుంచి ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కొంటామని తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు మంత్రి సత్యకుమార్‌ యాదవ్..

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..

ADR Report: 2022-2026 మధ్య కాలం నాలుగేళ్లలో పార్లమెంట్, అసెంబ్లీలకు గెలిచిన...

Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?

ప్రపంచంలో ఎన్నో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి. కొన్ని యుద్ధాలు నెలలు,...

Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక

భారతదేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదని.. కానీ దేశ భద్రత విషయంలో మాత్రం...

Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?

Off The Record: తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో పలు భూ...