7
July, 2026

A News 365Times Venture

7
Tuesday
July, 2026

A News 365Times Venture

Minister Satyakumar: అమరావతిపై జగన్‌కు మంత్రి సత్యకుమార్ సవాల్.. ఎన్నికలకు వెళ్దామా..?

Date:

Minister Satyakumar: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు, అమరావతి అంశంపై చేస్తున్న వ్యాఖ్యలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తీవ్రస్థాయిలో స్పందించారు. తాను అవకాశవాది కాదని, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, తన రక్తంలోనే బీజేపీ సిద్ధాంతాలు ఉన్నాయని, రాజకీయ అవకాశాల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదని అన్నారు. పేర్ని నాని మాత్రం అవకాశాల కోసం పార్టీలు మారే నాయకుడని విమర్శించారు.

జగన్‌ను వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శించలేదని, ఆయన విధానాలు, సిద్ధాంతాలనే ప్రశ్నిస్తున్నానని సత్యకుమార్ చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా ప్రభుత్వంపై చేసే విమర్శలను సహించబోనని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. రాజధాని అంశంపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలు అవగాహన లోపాన్ని సూచిస్తున్నాయని విమర్శించారు. అవసరమైతే ఈ అంశంపై ఎన్నికలకు వెళ్లి ప్రజల తీర్పు కోరాలని కూడా సవాల్ విసిరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత ప్రభుత్వంతో పోలిస్తే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా మార్పులు అవసరమని అంగీకరిస్తూ, వాటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌..

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

చీటింగ్ కేసుతోపాటు క్రిమినల్ కేసు.. ప్రొడ్యూసర్ వెంకట్ అనీష్ రెడ్డిపై కేసు నమోదు.!

సినీ నిర్మాత వెంకట్ అనీష్ రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు...

Job Interview Tips: సీఈవోను అడిగిన ఒక్క ప్రశ్నే కొంపముంచిందా..? భారతీయుడి అనుభవం వైరల్

Job Interview Tips: కెనడాలో నివసిస్తున్న భారతీయ ప్రొడక్ట్ మేనేజర్ కరణ్...

డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!

Xiaomi 18 Pro Max: షియోమీ నుండి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌గా...