16
April, 2026

A News 365Times Venture

16
Thursday
April, 2026

A News 365Times Venture

Middle East Crisis : మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్.. పాన్ ఇండియా సినిమాలపై తీవ్ర ప్రభావం

Date:

ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య వార్ నేపధ్యంలో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో నెలకొన్న యుద్ధ వాతావరణం, భయానక పరిస్థితులు భారతీయ సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రాలు వారణాసి మరియు రాకా తమ విదేశీ షూటింగ్ షెడ్యూళ్లను అర్థాంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా చిత్ర బృందాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న అడ్వెంచర్ థ్రిల్లర్ వారణాసి. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను దుబాయ్ లో చిత్రీకరించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుత సంక్షోభం దృష్ట్యా ఆ ప్లాన్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టారు. దీనికి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌లోనే భారీ సెట్లు వేసి చిత్రీకరణ జరపాలని రాజమౌళి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్లోబల్ ట్రిప్ ప్లాన్ చేసిన ఈ మూవీ టీమ్ పరిస్థితులు చక్కబడే వరకు వేచి చూడాలని భావిస్తోంది. మరోవైపు, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న రాకా సినిమా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్‌లను మిడిల్ ఈస్ట్ ఎడారులలో చిత్రీకరించాల్సి ఉంది. కానీ అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఇతర లోకేషన్ల కోసం వెతుకుతోంది లేదా ముంబైలోని స్టూడియోలలో సెట్టింగ్స్ వేసి షూట్ పూర్తి చేయాలని ఆలోచిస్తోంది. ఈ అకస్మాత్తు మార్పుల వల్ల సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరగడమే కాకుండా విడుదల తేదీలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

MLA Adimulam: ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడి సంచలన వ్యాఖ్యలు.. ఆ డబ్బులు ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా..!

MLA Adimulam: తిరుపతి జిల్లాలో రాజకీయ వర్గాల్లో కలకలం రేపేలా సత్యవేడు...

Sundeep Kishan: సందీప్ కిషన్ ‘పవర్‌ పేట’ షురూ.. అదిరిపోయే టైటిల్ పోస్టర్ అవుట్!

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో...

Tirupati Crime: తిరుపతిలో దారుణం.. 40 ఏళ్లుగా 10 అంకణాల స్థల వివాదం.. గొంతుకోసి హత్య

Tirupati Crime: చిన్నపాటి స్థల వివాదం ఓ వ్యక్తి నిండు ప్రాణాలు...