14
October, 2026

A News 365Times Venture

14
Wednesday
October, 2026

A News 365Times Venture

Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?

Date:

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై ఒక మహిళ దాడికి యత్నించినట్లు వార్తలు వస్తున్నాయి. కోల్‌కతాలో దుర్గా పూజా పండల్ ప్రారంభిస్తున్న సమయంలో ఒక మహిళ దాడికి యత్నించిందని ఆరోపిస్తున్నారు. సదరు మహిళ మమత చీర లాగిందని, ఆమె వద్ద నుంచి ఒక కత్తి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత తమ నేత భద్రతపై టీఎంసీ కార్యకర్తలు, నేతలు ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారు.

మంగళవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దాడి సమయంలో ఒక మహిళ మమతా బెనర్జీ వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి, అత్త అని పిలిచిందని, తర్వాత దాడికి ప్రయత్నించిందనే ఆరోపణలు ఉన్నాయి. సదరు మహిళ మత్తు పదార్థాల ప్రభావంలో ఉందని, ఆమె చేతిలో కత్తి ఉందని రాజ్యసభ ఎంపీ డోలా సేన్ ఆరోపించినట్లు తెలుస్తోంది. సదరు మహిళ తాను మమతా బెనర్జీ మేనకోడలని చెప్పుకుంటూ జన సమూహంలోకి చేరిందనే ఆరోపణలు ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం తర్వాత నుంచి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలపై ప్రజల దాడులు ఎక్కువయ్యాయి. చాలా మంది నేతలపై కోడిగుడ్లు, టొమాటోలతో దాడికి పాల్పడుతున్నారు. గతంలో అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. టీఎంసీ నేత కునాల్ ఘోష్‌పై కూడా కోడిగుడ్లతో దాడి చేశారు. టీఎంసీ నేతలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!

AP ZP Chairperson Reservations: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వరుసగా...

CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!

CM Revanth Reddy: తెలంగాణలో పలు చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయాలు...

OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?

OTR: కరపత్రాల యుద్ధానికి కారకులెవరు? తండ్రీ కొడుకులైన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేని టార్గెట్‌...

AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్‌, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్‌ వివరాలివే..!

AP Local Body Elections Schedule: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల...