16
November, 2026

A News 365Times Venture

16
Monday
November, 2026

A News 365Times Venture

Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవానికి మోడీ శుభాకాంక్షలు.. 2023 జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న ప్రధాని

Date:

కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. భక్తుల మదిలో ఆధ్యాత్మిక భావనలతో పాటు మెదిలే అతిపెద్ద మహోత్సవం భక్తి టీవీ నిర్వహించే ‘కోటి దీపోత్సవం’. పుష్కర కాలానికి పైగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల హృదయాల్లో అఖండ జ్యోతిగా వెలుగొందుతున్న ఈ మహా దీపయజ్ఞం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా మరోసారి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నవంబర్ 14 నుంచి 30 వరకు జరగనున్న ఈ ఆధ్యాత్మిక వేడుక విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక అభినందన లేఖ పంపడం ఈ ఉత్సవ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసింది.

ప్రధాని మోడీ ప్రశంసల జల్లు.. 2023 జ్ఞాపకాలు

కోటి దీపోత్సవం-2026 ప్రారంభ వేళ రచన టెలివిజన్ సంస్థకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా లేఖ రాశారు. భారతీయ సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మిక సంప్రదాయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత టీవీ చేస్తున్న అవిరళ కృషిని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ సందర్భంగా 2023 కోటి దీపోత్సవంలో తాను స్వయంగా పాల్గొని దీపారాధన చేసిన మధుర క్షణాలను మోడీ మరోసారి గుర్తుచేసుకున్నారు. నాడు ఈ వేదికపైకి విచ్చేసిన ప్రధాని.. ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని చూసి తాను సాక్షాత్తూ కాశీలోనే ఉన్న అనుభూతి కలుగుతోందని కొనియాడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఏడాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఈ వేడుకలో పాల్గొని, ఇలాంటి మహా యజ్ఞంలో పాలుపంచుకోవడం తన అదృష్టమని పేర్కొనడం కోటి దీపోత్సవ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఘట్టాలు.

‘వికాస్ భీ, విరాసత్ భీ’ స్ఫూర్తికి ప్రతీక

గత పన్నెండు సంవత్సరాలుగా భారతదేశం తన గొప్ప నాగరికతా వారసత్వాన్ని పరిరక్షించడానికి, ఘనంగా చాటిచెప్పడానికి నూతన ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని వివరించారు. మన పుణ్యక్షేత్రాలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు వాటి చారిత్రక వైభవాన్ని పునరుద్ధరించేందుకు కృషి జరుగుతోందని, తద్వారా ప్రజల్లో మన సాంస్కృతిక గుర్తింపు పట్ల గర్వభావం పెరుగుతోందని అన్నారు. నేడు భారతదేశం తన మూలాలతో బలమైన అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని, ఇదే ‘వికాస్ భీ, విరాసత్ భీ’ (అభివృద్ధితో పాటు వారసత్వం) స్ఫూర్తి అని పేర్కొన్నారు. కోటి దీపోత్సవం వంటి వేడుకలు ఈ నూతన సాంస్కృతిక ఆత్మవిశ్వాసానికి ప్రతీకలుగా నిలుస్తూ, అమూల్యమైన సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో తోడ్పడుతున్నాయని ప్రశంసించారు.

ప్రతి ఇంటా సుఖసంతోషాలు నిండాలి

కోటి దీపోత్సవం-2026 అత్యంత విజయవంతం కావాలని ఆకాంక్షించిన ప్రధాని మోడీ.. ఈ పవిత్రమైన సందర్భం ప్రతి ఇంటా సుఖసంతోషాలు, శాంతిని నింపాలని కోరుకున్నారు. ఈ దీపాల వెలుగు మన విశ్వాసాన్ని మరింత బలపరచి, దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయడానికి అందరికీ స్ఫూర్తినివ్వాలని ప్రధాని ఆకాంక్షించారు.

ఒకే వేదికపై ముక్కోటి దేవతల దర్శనం.. భక్తులకు సర్వం ఉచితం

రచన టెలివిజన్ అధినేత నరేంద్ర చౌదరి, రమాదేవి దంపతుల గొప్ప సంకల్పంతో 2012లో శృంగేరి జగద్గురువుల సమక్షంలో మొదలైన ఈ దీపయజ్ఞం నేడు మహా వృక్షమై ఆధ్యాత్మిక వెలుగులు పంచుతోంది. ఒక దీపం వెలిగిస్తే మనలో పాజిటివిటీ నిండుతుందని, కోటి దీపాలు వెలిగిస్తే అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞానకాంతిని ప్రసాదిస్తుందని రచన ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రచన వివరించారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా భక్తుల నుంచి ఒక్క రూపాయి రుసుము గానీ, కానుకలు గానీ తీసుకోకుండా.. ప్రమిదలు, నూనె, వత్తులు, శివలింగాలు, పూజా సామగ్రిని నిర్వాహకులే ఉచితంగా అందిస్తుండటం విశేషం.

కైలాసాన్ని తలపించే వేదిక.. పీఠాధిపతుల అనుగ్రహ భాషణాలు

ఎన్టీఆర్ స్టేడియంలో కైలాసాన్ని తలపించేలా తీర్చిదిద్దిన సభావేదికపైకి వస్తే సమస్త పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న అనుభూతి కలుగుతుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, పంచభూతలింగాలు, శ్రీవైష్ణవ దివ్యదేశాల నుంచి తరలివచ్చే ఉత్సవమూర్తులకు ఇక్కడ నిత్యం కన్నులపండువగా కల్యాణోత్సవాలు, విశేష పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా శృంగేరి, కంచి, మైసూరు దత్తపీఠం వంటి దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, జగద్గురువులు ఈ వేడుకకు విచ్చేసి భక్తులకు తమ అనుగ్రహ భాషణాలతో జ్ఞానబోధ చేయనున్నారు. భక్తిపారవశ్యంతో సాగే ఈ 17 రోజుల మహా దీపయజ్ఞం ప్రతి ఒక్కరి జీవితంలో ఆధ్యాత్మిక కాంతులను నింపనుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Kishtwar SPO Killings: ‘‘మసీదు నుంచి బెదిరింపులు, ఇద్దరు పోలీసుల హత్య’’ బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు..

Kishtwar SPO Killings: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఇద్దరు ప్రత్యేక...

SP-Congress Alliance: 200కు పైగా సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. నవంబర్ 17న అఖిలేశ్‌తో కీలక భేటీ!

SP-Congress Alliance: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. మరోవైపు...

Vigilance Raids: అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం.. రూ. 10.43 కోట్ల సరుకు స్వాధీనం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు, నిల్వలు, సరఫరాపై విజిలెన్స్ శాఖ...

Rahul Gandhi : ఫాసిస్టు శక్తులను తరిమికొడతాం.. హైదరాబాద్ వేదికగా రాహుల్ గాంధీ పిలుపు

హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ‘భారత్ సమ్మిట్’ ముగింపు సభలో లోక్‌సభ...