26
April, 2026

A News 365Times Venture

26
Sunday
April, 2026

A News 365Times Venture

KL Rahul Emotional: పాపం కేఎల్ రాహుల్.. ఆరెంజ్ క్యాప్ వచ్చినా కనపడని ఆనందం..

Date:

ఐపీఎల్ 2026లో ఏప్రిల్ 25న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఒక అద్భుతానికి వేదికైంది. విమర్శలన్నింటినీ పక్కన పెట్టి, ఆధునిక టీ20 క్రికెట్ వేగానికి అనుగుణంగా తనను తాను మలచుకున్న కె.ఎల్. రాహుల్, పంజాబ్ కింగ్స్‌పై కనీవినీ ఎరుగని రీతిలో చెలరేగిపోయారు. కేవలం 67 బంతుల్లోనే 152 పరుగులతో అజేయంగా నిలిచి, ఐపీఎల్ చరిత్రలోనే ఒక మైలురాయిని సృష్టించారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్ విధ్వంసం మామూలుగా లేదు. ఈ మ్యాచ్‌లో రాహుల్ సెంచరీతో పాటు పలు చారిత్రాత్మక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో 150 పరుగుల మైలురాయిని దాటిన మొట్టమొదటి భారతీయ బ్యాటర్‌గా రాహుల్ సరికొత్త చరిత్ర సృష్టించారు. క్రిస్ గేల్ (175), బ్రెండన్ మెకల్లమ్ (158) తర్వాత ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (152) సాధించిన మూడవ బ్యాటర్‌గా నిలిచారు.

తొలి ఇన్నింగ్స్ ముగిశాక రాహుల్ ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు. పవర్ ప్లేలో ఆడే ఓపెనర్స్ ఎంతో ఉత్సాహంగా, హుషారుగా ఉండాలి.. ప్రతీ బాల్ ను బౌండరీకి తరలించాలనే ఆలోచనతోనే ఉండాలి.. మొదటి బంతి నుండే అటాక్ చేయాలి. నితీష్ రాణా అద్భుతమైన నాక్ ఆడాడు. సరైన క్రికెట్ షాట్లతో పవర్ ప్లేలో పరుగులు రాబట్టినప్పుడు బౌలింగ్ టీమ్ మరింత ఒత్తిడికి లోనవుతుంది” అని రాహుల్ వివరించారు. కానీ మ్యాచ్ ఓడిపోవడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశాడు.

తను చేసిన కృషికి ప్రతిఫలంగా జట్టుకు 264 పరుగుల కొండంత స్కోరును అందించినప్పుడు, రాహుల్ గెలుపు ధీమాతో ఉన్నాడు. కానీ, విధి మరోలా వెక్కిరించింది. పంజాబ్ ఓపెనర్లు సృష్టించిన రికార్డు పవర్ ప్లే విధ్వంసం ముందు రాహుల్ కష్టం నీటి మూటలా మారిపోయింది. 7 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ గెలిచింది.

ఒక ఆటగాడిగా తాను అసాధారణ ప్రదర్శన ఇచ్చి, రికార్డులన్నీ తిరగరాసినా.. జట్టు ఓడిపోతుంటే ఆ బాధ వర్ణనాతీతం. రికార్డులు గణాంకాల్లో నిలిచిపోతాయి, కానీ ఆ క్షణంలో కలిగిన ఓటమి వేదన రాహుల్‌ను తీవ్రంగా కలచివేసింది. ఆరెంజ్ క్యాప్ తీసుకునే సమయంలో ఎవరైనా సంతోషంగా ఉంటారు.. కానీ రాహుల్ ముఖంలో మాత్రం ఆ సంతోషం కనిపించలేదు. అంతటి చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడినా జట్టు గెలవకపోవడం అనేది అతని కెరీర్‌లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. మైదానంలో రాహుల్ బ్యాట్ గెలిచింది కానీ, అదృష్టం మాత్రం వెక్కిరించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!

Donald Trump: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో జరిగిన వైట్ హౌస్ కారస్పాండెంట్స్...

US-Iran talks: శాంతి చర్చల్లో అనిశ్చితి.. పాక్ నుంచి వెళ్లిపోయిన ఇరాన్ బృందం..

US-Iran talks: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్న రెండో విడత...

Off The Record : కాకినాడలో ‘పేకాట’ జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?

కలిసి ఉంటే కలదు సుఖం అన్న మాటను ఆ రెండు నియోజకవర్గాల...

Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..

Donald Trump: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక గా జరగాల్సిన అమెరికా-ఇరాన్...