18
August, 2026

A News 365Times Venture

18
Tuesday
August, 2026

A News 365Times Venture

KBR Park: కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనదారులకు నరకం.. ఈ రూట్లల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..

Date:

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో నేటి నుంచి అమలు చేస్తున్న వన్ వే ట్రాఫిక్ విధానం వాహనదారులకు తీవ్ర నరకం చూపిస్తోంది. సరైన ముందస్తు వ్యూహం, ప్రణాళిక లేకుండా వన్ వే అమల్లోకి తేడంతో నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, ప్రజలు గంటల తరబడి రహదారులపైనే చిక్కుకుపోతున్నారు. లేన్ చేంజ్ రూట్లతో పాటు కనెక్టింగ్ రోడ్లలో ట్రాఫిక్ పోలీసులు సరిపడా అందుబాటులో లేకపోవడంతో ప్రధాన రహదారులపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి. కనెక్టింగ్ రూట్లలో ఏర్పడుతున్న స్తంభన నేరుగా మెయిన్ రోడ్లపై పడటంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది.

ఈ వన్ వే ప్రభావం రోడ్ నెంబర్ 12పై తీవ్రంగా పడింది. మసాబ్ ట్యాంక్ వైపు నుంచి వచ్చే వాహనాలు రోడ్ నెంబర్ 12 వద్ద భారీగా ఇరుక్కుపోతున్నాయి. ప్రతినిత్యం ఆఫీసులకు వెళ్లే క్రమంలో సగం సమయం ఈ నరకప్రాయమైన ట్రాఫిక్‌లోనే సరిపోతోందని ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా మూడు గంటలకు పైగా ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో బైక్‌లు అమితంగా హీట్ ఎక్కి, ద్విచక్రవాహనదారులు వాహనాలను పక్కకు నిలిపివేసి నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

అత్యవసర సేవలకూ ఈ రోడ్డు ఆంక్షలు తీవ్ర అడ్డంకిగా మారాయి. క్యాన్సర్ ఆస్పత్రి నుంచి తెలంగాణ భవన్ వైపు వచ్చే రూట్‌లో ఓ అంబులెన్స్ ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో ముందుకు వెళ్లడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఈ మార్గమంతా వాహనాలు బంపర్ టు బంపర్ కదులుతున్నాయి. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి తెలంగాణ భవన్ వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఒకవైపు పోలీసులు వాహనాలను పూర్తిగా ఆపేస్తుండటంతో తెలంగాణ భవన్ వైపు వెళ్లాలంటే సుదీర్ఘ సమయం వేచి చూడాల్సి వస్తోంది. ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ చౌరస్తా నుంచి తెలంగాణ భవన్ రూట్ మొత్తం రెండు వైపులా పూర్తిగా జామ్ కావడంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. కేవలం ఆఫీసులకు చేరుకోవడానికే రెండు గంటలకు పైగా పడుతుండటంతో ట్రాఫిక్ పోలీసుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Indian Player: వైభవ్ సూర్యవంశీ కంటే తోపు అన్నారు.. కట్ చేస్తే మైదానంలోనే పరువు పోయింది..

దిగ్వేశ్ రాఠీ ఢిల్లీ తరఫున ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించి, 2024-25 సయ్యద్...

Bhatti Vikramarka: పెట్టుబడిదారులకు స్వర్గధామం తెలంగాణ.. క్లీన్ ఎనర్జీ మ్యానుఫాక్చరింగ్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం.!

Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్రం అన్ని రకాల పెట్టుబడిదారులను ప్రోత్సహించే స్వర్గధామమని,...

Adulterated Ghee: పాడైపోయిన క్రీమ్‌తో నెయ్యి దందా.. 25 టన్నుల నకిలీ నెయ్యి పట్టివేత..

హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ నెయ్యి మాఫియాపై హైదరాబాద్...