27
October, 2026

A News 365Times Venture

27
Tuesday
October, 2026

A News 365Times Venture

Kashi Art Cafe Row: కాశీ కేఫ్‌లో ‘బీఫ్’ వివాదం.. ఇదేం సెక్యులరిజం? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్

Date:

Kashi Art Cafe Row: కొచ్చిలోని కాశీ ఆర్ట్ కేఫ్ వివాదం రాజకీయంగా మరింత ఉద్రిక్తతలకు కారణమైంది. ఉత్తరాదికి చెందిన యూట్యూబర్ అమృత్ సింగ్ డారెన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కాశీ కేఫ్‌లో గాంధీ బొమ్మ పక్కనే మహ్మద్ అలీ జిన్నా విగ్రహం కూడా ఉందని, కేఫ్‌లో బీఫ్ వడ్డిస్తున్నారనే వీడియోను పోస్ట్ చేశారు. అయితే, దీనిపై కేరళ ప్రభుత్వం మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాడని డారెన్‌పై కేసు పెట్టారు. అయితే, కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మత సామరస్యం గురించి మాట్లాడుతున్న సీఎం వీడీ సతీషన్, అన్ని మతాల విశ్వాసాలు, మనోభావాల పట్ల సమానంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. ఆయన వైఖరిని ‘‘సెలెక్టివ్ సెక్యులరిజం’’గా అభివర్ణించారు. కాశీ అనే హిందూ పవిత్ర నగరం పేరుపై ఉన్న కేఫ్‌లో బీఫ్ వడ్డించడం ఆ రెస్టారెంట్ హక్కే అని.. ఇదే తరహాలో ఒక ముస్లిం పవిత్ర నగరం పేరుతో రెస్టారెంట్ ఏర్పాటు చేసి, అందులో పంది మాంసం వడ్డిస్తే ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మతపరమైన భావాలను గౌరవించే విషయంలో ఇలా వ్యవహరించవద్దని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్, సీపీఎం పార్టీలు ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, జమాతే ఇస్లామీతో వ్యవహరిస్తున్న తీరును కూడా చంద్రశేఖర్ తప్పుపట్టారు. ఈ పార్టీల రాజకీయ వైఖరి కేరళ ప్రజలకు పరిమితమైన ఎంపికలనే మిగులుస్తోందని ఆరోపించారు. జమాతే ఇస్లామీ లౌకికవాదానికి, రాజ్యాంగానికి వ్యతిరేక సంస్థ అని అన్నారు.

దీనికి ముందు ఈ వివాదంపై స్పందించిన సీఎం వీడి సతీషన్ .. కేరళ ప్రజలు ఐక్యంగా ఉన్నారని, మత విద్వేషాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నాలను సహించబోమని అన్నారు. కేరళను ప్రతికూలంగా చూపిస్తూ, ఫోర్ట్ కొచ్చి గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి, వర్గాల మధ్య చీలికలు సృష్టించే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదైందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?

Chairmans Desk: తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా రాజకీయం కొత్త పోకడలు పోతూనే...

Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!

Smriti Mandhana: జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు...

8000mAh బ్యాటరీ, 90Hz డిస్‌ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!

Honor Pad X10 Mini: హానర్ (Honor) నుండి సరికొత్తగా ‘Honor...