9
August, 2026

A News 365Times Venture

9
Sunday
August, 2026

A News 365Times Venture

Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!

Date:

Jowar Dry Fruits Laddu: జొన్నలను బేస్‌గా తీసుకుని.. అవిసగింజలు, వివిధ సీడ్స్, డ్రై ఫ్రూట్స్‌తో హెల్తీ లడ్డు తయారు చేసుకోవచ్చు. ఇవి అధిక ప్రోటీన్ కలిగి ఉంటాయి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకటి లేదా రెండు లడ్డూలు తినడం సరిపోతుంది. మరి ఈ ప్రోటీన్ రిచ్ లడ్డును ఎలా చేసాయిలో చూసేద్దామా..

కావాల్సిన పదార్థాలు:

* జొన్నలు – 200 గ్రా.
* అవిసగింజలు (ఫ్లాక్స్ సీడ్స్) – 100 గ్రా.
* వాటర్‌మెలన్ సీడ్స్ – 100 గ్రా.
* కర్బూజా సీడ్స్ – 100 గ్రా.
* సన్‌ఫ్లవర్ సీడ్స్ – 100 గ్రా.
* పంప్కిన్ సీడ్స్ – 100 గ్రా.
* వాల్నట్స్ – 100 గ్రా.
* బాదాం – 100 గ్రా.
* జీడిపప్పు – 50 గ్రా.
* బ్లాక్ కిస్మిస్ – 30 గ్రా.
* నెయ్యి – తగినంత
* బెల్లం – 200 గ్రా.

తయారీ విధానం:

మొదటగా స్టవ్ ఆన్ చేసి పాన్‌లో జొన్నలు వేయండి. నెయ్యి లేదా ఆయిల్ ఏమీ వేయకుండా దోరగా వేయించుకోండి. కలర్ మారితే, ఒకటి రెండు నోట్లో వేసి చూస్తే వేగాయని అర్థమవుతుంది. ఆయిల్ వేస్తే పాప్‌కార్న్‌లా అయిపోతాయి. కాబట్టి డ్రైగా వేయించడం మంచిది. వేగిన తర్వాత గిన్నెలోకి తీసేయండి.

ఆ తర్వాత అదే పాన్‌లో నెయ్యి వేసుకొని.. ముందుగా బాదాం వేసి కాస్త వేగనివ్వండి. తర్వాత జీడిపప్పు, వాల్నట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్, కర్బూజా సీడ్స్, అవిసగింజలు వేసి దోరగా వేయించుకోండి. కలర్ మారి చిటపటలాడేవరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. చివర్లో బ్లాక్ కిస్మిస్ వేయండి. ఇప్పుడు వేగిన జొన్నలు, డ్రై ఫ్రూట్స్-సీడ్స్ మిశ్రమం, బెల్లం అన్నీ కలిపి ఒకేసారి గిన్నెలో వేయండి.

వీటన్నిటిని కాస్త వేడిగా ఉన్నప్పుడే మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి. ఒకేసారి అన్నీ వేయకుండా కొంచెం కొంచెంగా వేసి, మధ్యలో కలుపుతూ చేయండి. పూర్తిగా ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం కొంచెం మెత్తగా ఉండేలా చేయండి. చల్లబడితే లడ్డు కట్టడం కష్టం కాబట్టి వేడిగా ఉన్నప్పుడే చేయాలి. పిండిని బాగా కలిపి.. మీడియం సైజులో లడ్డూలు చుట్టుకోండి. నెయ్యి కొంచెం ఎక్కువైతే ఎక్కువ జిగటగా ఉంటుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Vaibhav Sooryavanshi: హెల్మెట్ పగిలేలా బంతి విసురుతా… వైభవ్ సూర్యవంశీకి షాకింగ్ ఛాలెంజ్..

భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఆస్ట్రేలియా మాజీ వేగవంతమైన...

Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..

Russia-india Rail Route: రష్యా నుంచి భారత్ వరకు రైలు మార్గం...

Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..

Vaibhav Sooryavanshi: ప్రస్తుత కాలంలో క్రికెట్ అంటే కేవలం మైదానంలో బ్యాట్,...

Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!

Hyderabad: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద శనివారం తెల్లవారుజాము నుంచే...