8
August, 2026

A News 365Times Venture

8
Saturday
August, 2026

A News 365Times Venture

Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్‌ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Date:

Jos Buttler: టీ20 క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ విధ్వంసకర బ్యాటర్ జోస్ బట్లర్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ‘ది హండ్రెడ్’ టోర్నీలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతూ వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ ఈ ఘనత సాధించాడు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ (14,803 పరుగులు) రికార్డును అధిగమించి, టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు రికార్డు సాధించడానికి 22 పరుగులు అవసరం కాగా, బట్లర్ కేవలం 20 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో విరుచుకుపడి నాటౌట్‌గా 51 పరుగులు చేశాడు. దీంతో అతని టీ20 కెరీర్ స్కోరు 522 మ్యాచ్‌ల్లో 14,833 పరుగులకు చేరింది.

ఈ చారిత్రక మైలురాయిని చేరుకున్న అనంతరం బట్లర్ చేసిన వ్యాఖ్యలు భారత క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. టీ20లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందని, అయితే రికార్డులు తుదివరకు నిలవవని బట్లర్ అన్నాడు. భవిష్యత్తులో తన ప్రపంచ రికార్డును తిరగరాసే సత్తా భారత్‌కు చెందిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకే ఉందని బట్లర్ జోస్యం చెప్పాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించిన వైభవ్, టీ20లలో ఇప్పటికే 40 మ్యాచ్‌ల్లో 1,670 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్, 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకోవడం విశేషం. ఇక, 35 ఏళ్ల జోస్ బట్లర్ కెరీర్ ఎంతో అద్భుతంగా సాగింది. ఇంగ్లాండ్ తరఫున 160 టీ20ల్లో 4,212 పరుగులు చేసిన అతను, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 వేర్వేరు ఫ్రాంచైజీ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. వైటాలిటీ బ్లాస్ట్‌లో లంకాషైర్, సమర్‌సెట్.. SA20లో పార్ల్ రాయల్స్, డర్బన్స్ సూపర్ జెయింట్స్.. బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్, సిడ్నీ థండర్.. బీపీఎల్‌లో కమిల్లా విక్టోరియన్స్‌లకు ఆడాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ వంటి దిగ్గజ జట్లకు ఆడి తన ప్రతిభను చాటుకున్నాడు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Lokesh Kanagaraj DC Movie Review : లోకేష్ కనగరాజ్ ‘డీసీ’ రివ్యూ..

Lokesh Kanagaraj DC Movie Review: తమిళ సినీ పరిశ్రమలో చేసింది...

WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..

WTC 2025-27: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 ఫైనల్ రేసులో...

Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు

Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్రాన్ని తమ పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు తొలి...

KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!

KL Rahul: భారత్, శ్రీలంక మధ్య జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు...